Breaking News

బడ్జెట్‌పై వరుదు కల్యాణి ప్రశ్నలు.. పదేపదే అడ్డుకున్న టీడీపీ మంత్రులు

Published on Thu, 11/14/2024 - 14:13

సాక్షి, అమరావతి: ఏపీ శాసన మండలిలో వైఎస్సార్‌సీపీ వర్సెస్‌ టీడీపీగా మారింది. మండలిలో బడ్జెట్‌పై వైఎస్సార్‌సీపీ సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక టీడీపీ సభ్యుల ఎదురుదాడికి దిగారు. సంబంధం లేని అంశాల్ని ప్రస్తావిస్తూ సభలో గందరగోళం సృష్టించారు. బడ్జెట్‌పై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ప్రశ్నలు కురిపించారు. 3 సిలిండర్లు ఇస్తామని ఈ ఏడాది 2 సిలిండర్లకు ఎగనామం పెట్టారని మండిపడ్డారు. రూ. 5,387 కోట్లు ఇస్తే తల్లికి వందనం ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు.

అయితే వరుదు కల్యాణి ప్రసంగిస్తుండగా హోంమంత్రి  అనిత అడ్డుతగిలారు. వరుదు కల్యాణి మాట్లాడుతుండగా మంత్రులు అనిత, సవిత, బాల వీరంజనేయులు ఆటంకం కలిగించారు. ఎమ్మెల్సీ కల్యాణిని సభలో మాట్లాడకుండా అడుగడుగునా టీడీపీ సభ్యులు అడ్డుకున్నారు.

మంత్రుల తీరుపై ప్రతిపక్ష నేత  బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులు మాట్లాడుతుండగా మంత్రులే అభ్యంతరం తెలపడం ఏంటని ఆగ్రహించించారు.

వైస్సార్సీపీ ఎమ్మెల్సీల  ప్రశ్నలకు సమాధానం చెప్పలేక గతంలో తమ తల్లిని తిట్టారంటూ లోకేష్ గగ్గోలు పెట్టగా.. సంబంధం లేని సబ్జెక్ట్‌ను ఎందుకు తీసుకొచ్చారని బొత్స ప్రశ్నించారు. సభలో ఇటువంటి సాంప్రదాయం సరికాదంటూ ఆయన సూచించారు. దీంతో గందరగోళం నడుమ సభను చైర్మన్‌ రేపటికి(శుక్రవారం) వాయిదా వేశారు.

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)