Breaking News

టీడీపీ ఎమ్మెల్యే థామస్‌కు బిగ్‌ షాక్‌

Published on Fri, 07/25/2025 - 16:44

సాక్షి, చిత్తూరు జిల్లా: జీడి నెల్లూరు ఎమ్మెల్యే థామస్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. ఆయన పీఏ చంద్రశేఖర్‌పై టీడీపీ నేతలే జిల్లా కలెక్టర్‌కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు చేసిన వారిలో థామస్ సోదరుడు నిధి కూడా ఉండటం తీవ్ర చర్చాంశనీయంగా మారింది.

థామస్‌ పీఏ చంద్రశేఖర్‌ను విధులు నుంచి తొలగించాలని కోరుతూ చిత్తూరు కలెక్టరేట్‌లో టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. జీడి నెల్లూరు నియోజకవర్గం టీడీపీ నాయకులంతా కలిసిగట్టుగా వెళ్లి జిల్లా కలెక్టరేట్‌లో కంప్లైంట్ చేశారు. ఎమ్మెల్యే థామస్ పీఏ చంద్రశేఖర్‌ అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతున్నాయని.. వెంటనే సస్పెండ్ చేయాలంటూ టీడీపీ నేతలు కోరారు.

ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ, టీడీపీ పార్టీ వ్యవహారాల్లో దూరి రాజకీయాలు చేస్తున్నాడు. జీడి నెల్లూరు నియోజకవర్గంలో టీడీపీలో ప్రతి మండలానికి తన వర్గాన్ని ఏర్పాటు చేసి కోట్లు దండుకున్నాడు’’ అంటూ టీడీపీ నేతలు ఫైర్‌ అయ్యారు.

‘‘టీడీపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాం. ఎమ్మెల్యే థామస్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. ఎమ్మెల్యే పీఏ చంద్రను వెంటనే తొలగించాలి. అతని ఆస్తులపై విజిలెన్స్ విచారణ జరిపించాలని కలెక్టర్‌ను కోరుతున్నాం. నియోజకవర్గంలో ఎమ్మెల్యే పీఏ నలుగురు ముఠా సభ్యులను ఏర్పాటు చేసుకుని కోట్లు దోచుకుంటున్నారు’’ అంటూ టీడీపీ నేతలు చెప్పుకొచ్చారు. ఫిర్యాదు చేసిన వారిలో థామస్ సోదరుడు నిధి కూడా ఉండటం తీవ్ర చర్చాంశనీయంగా మారింది.

 

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)