అమరావతి ప్రజలారా.. బాబుని నమ్మొద్దు.. టీడీపీ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

Published on Sat, 06/07/2025 - 15:08

సాక్షి, విజయవాడ:  అమరావతి ప్రజలారా.. బాబుని నమ్మొద్దు అంటూ సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత శోభనాద్రీశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిని మూడు దశల్లో నిర్మించేందుకు 35 ఏళ్లు పడుతుందని కూటమి ప్రభుత్వం వరల్డ్ బ్యాంకుకు చెప్పింది. ఇప్పుడే అదే రాజధానిని రెండు మూడేళ్లలో పూర్తి చేస్తామని చంద్రబాబు,నారాయణ ఎలా చెబుతారని మండిపడ్డారు. 

రాజధాని నిర్మాణం కోసం మరో 45వేల ఎకరాలు సేకరించేందుకు సిద్దమైన తరుణంలో కూటమి ప్రభుత్వం తీరును విమర్శిస్తూ శోభనాద్రీశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ‘33 వేల ఎకరాలు ఇచ్చి రైతులు త్యాగం చేశారు. రైతుల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. పదేళ్లు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించుకునే అవకాశం ఉంది.

అతి తెలివితేటలతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికో డబ్బిచ్చి దొరికిపోయారు. మన ప్రాంతం నుంచే  పాలించుకోవాలని ఏపీకి వచ్చేశారు. ఇక్కడికి వచ్చిన చంద్రబాబు ఇల్లు ఏమైనా కట్టుకున్నాడా? ప్రజలకు అవసరమైన విధానాలను అమలు చేసేదే రాజధాని. ప్రజలను మెంటల్‌గా డైవర్షన్ చేయడానికి చంద్రబాబు, ఆయన మీడియా ప్రయత్నం చేస్తోంది.

అమరావతి కోసం భూమి పూజ చేసిన వాడు నాలుగేళ్లలో రోడ్లు వేశారా?ఇప్పుడు మరో 45 వేల ఎకరాలు కావాలంటున్నారు. రాజధాని ప్రాంతంలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ఉంటేనే పెట్టుబడులు వస్తాయంటున్నారు. భారతదేశం మొత్తం మీద ఎక్కువ భూమి ఉన్న ఎయిర్ పోర్టు శంషాబాద్ మాత్రమే.ఇప్పుడు అమరావతిలో 5 వేల ఎకరాలతో ఎయిర్ పోర్టు కడతామంటున్నాడు. ఏపీలో ఇప్పటికే 6 ఎయిర్ పోర్టులున్నాయి. అమరావతిలో మరో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు కడతానంటున్నాడు.

	అవసరానికి మించి అమరావతిలో భూసేకరణ: వడ్డే

భోగాపురంలో ఎయిర్ పోర్టు కడుతుంటే.. శ్రీకాకుళంలోనూ ఎయిర్ పోర్టు కడతామంటున్నాడు. శ్రీకాకుళంలో కిడ్నీ వ్యాధులతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. వారికి తాగునీరు ఇవ్వకుండా  ఎయిర్ పోర్టు కడతాననడానికి చంద్రబాబుకు ఇంగిత జ్ఞానం లేదా?.మరో 45 వేల ఎకరాలు తీసుకోవాలనే ఆలోచనను చంద్రబాబు మానుకోవాలి. కుప్పం ప్రాజెక్టు చేసిన బిల్లీరావుతో చంద్రబాబుకు లింక్ ఏర్పడింది. హైదరాబాద్‌లో ల్యాండ్ ఇస్తే ఒలంపిక్స్ మెడల్స్ అన్నీ ఏపీకి తెచ్చేస్తానన్నాడు. సెంట్రల్ యూనివర్శిటీ పక్కన 400 ఎకరాల భూమిని ఎకరా 50 వేల చొప్పున అమ్మేశారు.

శంషాబాద్‌లో 400 ఎకరాలు ఎకరా 25 వేల చొప్పున అమ్మేశారు. చంద్రబాబు 800 ఎకరాలు ఇస్తే వాడు స్టేడియం కూడా కట్టలేదు. వైఎస్సార్ సీఎం అయ్యాక  ఆ భూముల ఒప్పందాన్ని రద్దు చేశారు. పొరపాటని తెలిసినా రాజకీయపార్టీలు మాట్లాడటం లేదు. దేశంలోనే అత్యంత సారవంతమైన భూములను నదీముఖ అభివృద్ధి పేరుతో తీసుకున్నారు. కృష్ణా కరకట్టకు రెండు మూడు కిలోమీటర్ల పరిధిలో బ్లూ&గ్రీన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే కట్టడానికి సాధ్యమని గ్రీన్ ట్రిబ్యునల్ తేల్చింది.

విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు అక్క ఆరాటమే కానీ బావ బ్రతకడు సామెత మాదిరిగానే ఉంటుంది. లక్షల ఎకరాలు తీసుకుని కార్పొరేట్లకు ధారాదత్తం చేయాలని చూస్తున్నారు. రైతులకు చేతులెత్తి మొక్కుతున్నా. చంద్రబాబు కోరుతున్న 45 వేల ఎకరాలను ఇవ్వాలనుకుంటున్న రైతులు వారి ఆలోచనను విరమించుకోండి. ఇలాంటి పిచ్చి ఆలోచనలను ప్రజలంతా వ్యతిరేకించాలి’ అని పిలుపునిచ్చారు. 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)