300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు
Breaking News
బుజ్జగింపుల పర్వం.. పవన్‌పై పోస్ట్ డిలీట్!
Published on Sun, 06/07/2026 - 21:58
కడప: రాజ్యసభ సభ్యత్వం ఆశించి భంగపడ్డ టీడీపీ నేతలను బుజ్జగించే పనిలో పడింది అధిష్టానం. టికెట్ ఆశించి భంగపడ్డ వారిలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త, టీడీపీ రాయలసీమ జోనల్ కో ఆర్డినేటర్ శ్రీనివాసులురెడ్డి ఒకరు. తనకు రాజ్యసభ సీటు ఇవ్వకపోవడంపై సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెట్టారు శ్రీనివాసులురెడ్డి.
అందులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ పెట్టిన పోస్ట్ ఒకటి. ఈ పోస్ట్‌ను టీడీపీ అధిష్టానం డిలీట్ చేయించింది. ఎక్స్‌లో పోస్ట్ చేసిన ఆ ట్వీట్ కనుమరుగు కావడంతో ఇది కాస్తా బుజ్జగింపు పర్వం చర్చకు దారి తీసింది. టీడీపీ అధిష్టానం ఆశావహులను బుజ్జగించే క్రమంలోనే శ్రీనివాసులరెడ్డి చేత ఆ పోస్ట్ డిలీట్ చేయించిందనే చర్చ నడుస్తోంది. మరొకవైపు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని కూడా శ్రీనివాసులురెడ్డి ప్రకటించడంతో బుజ్జగింపుల పర్వం ప్రారంభమైందనేది విశ్లేషకుల మాట.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే..
డిసెంబర్ 2024లో పవన్ కళ్యాణ్ కడప పర్యటన నేపథ్యంలో పేరెంట్స్-టీచర్స్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఆ మీటింగుకు ఖర్చు పెట్టిన బిల్లులు ఇంతవరకూ ఇవ్వలేదంటూ పవన్ కళ్యాణ్‌ను ట్యాగ్ చేస్తూ శ్రీనివాసులురెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఆర్ అండ్ బి శాఖలో బిల్లు పెండింగ్ ఉందన్న శ్రీనివాసులురెడ్డి.. పవన్‌ను సూటిగా ప్రశ్నించారు. పార్టీ కార్యకర్త సొంత నిధులు ఖర్చు చేస్తే 18 నెలలుగా బిల్లులు ఇవ్వరా అని నిలదీశారు. నెలలు తరబడి బిల్లు పెండింగులో ఉంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అదే సమయంలో తనకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వకపోవడంపై కూడా టీడీపీ అధిష్టానానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు శ్రీనివాసులురెడ్డి.
ఇదీ చదవండి..
చంద్రబాబుపై శ్రీనివాసులు రెడ్డి ఫైర్
రాజ్యసభ సభ్యత్వం ఇవ్వకపోవడంపై పెట్టిన పోస్ట్ ఇది..
గత 13 సంవత్సరాలుగా కడప లాంటి అత్యంత క్లిష్టమైన రాజకీయ పరిస్థితులు ఉన్న జిల్లాలో తెలుగుదేశం పార్టీకి అండగా నిలుస్తూ, పార్టీని బలోపేతం చేయడానికి అహర్నిశలు కృషి చేశాను. రాజకీయ, ఆర్థిక, మానసిక, శారీరక ఒత్తిళ్లను ఎదుర్కొంటూ పార్టీ జెండా ఎప్పటికీ ఎగురుతూ ఉండాలనే సంకల్పంతో పని చేశాను.…
— Srinivasa Reddy Reddeppagari (@ReddeppagariSVR) June 7, 2026

Tags : 1