Breaking News

ప్రభుత్వ ఉద్యోగులపై టీడీపీ నేత సోమిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

Published on Sun, 04/02/2023 - 14:35

సాక్షి, నెల్లూరుజిల్లా: ప్రభుత్వ ఉద్యోగులపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లంచాలు తీసుకుంటూ ఉద్యోగులు కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారు.

ఈ వ్యాఖ్యలపై ఉద్యోగ సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉన్నామని, తమపై సోమిరెడ్డి అక్కసు వెళ్లగక్కుతున్నారని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
చదవండి: ఆ.. నా కొడుకులకు జీతాలివ్వడానికా పన్నులు వసూలు చేసేది?

కాగా, ఉద్యోగులపై గతంలో చంద్రబాబు, తోకపత్రిక ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఎంప్లాయీస్‌ గుర్తుచేసుకుంటున్నారు. వారి మధ్య సంభాషణలకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. దాన్ని ఒకసారి చూస్తే.. చంద్రబాబు-రాధాకృష్ణ సమావేశమై వివిధ అంశాలపై చర్చించుకున్నారు. తమకు కల్పించాల్సిన ప్రయోజనాల గురించిన ఉద్యోగుల డిమాండ్‌ ప్రస్తావనకు రాగానే రాధాకృష్ణ బూతు పురాణం లంకించుకున్నారు.

ఆయన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను అవమానించేలా, కించపరుస్తూ మాట్లాడుతుంటే.. ముఖ్యమంత్రి చిద్విలాసంగా ఆస్వాదిస్తూ ఉండిపోయారు. పైగా రాధాకృష్ణ చెప్పినవన్నీ నిజాలేనని కితాబిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగులపై తనకున్న కక్షను పరోక్షంగా చాటుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులను ‘ఆ .. నా కొడుకులు’ అని రాధాకృష్ణ దుర్భాషలాడినా.. అలా అనడం తప్పని చంద్రబాబు అనకపోవడం గమనార్హం.

అధికారం లేకపోతే మనమేమీ చేయలేమని, అధికారం కోసం కొన్ని హామీలు ఇవ్వాలని సీఎం చెప్పుకొచ్చారు. మొదట్లో కొంత ఉదారంగా ఉంటే తర్వాత ఏదో ఒకటి చేయొచ్చని అన్నారు. రుణమాఫీ హామీ కూడా అధికారం కోసమే ఇచ్చామంటూ మనసులో మాట చెప్పేశారు.

చదవండి: మేము తలుపులు తెరిస్తే టీడీపీలో మిగిలేది వారిద్దరే: బాలినేని

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)