Breaking News

అలా రాస్తే మీ ఇంటికి వస్తా.. మీడియాకు టీడీపీ నేత జేసీ వార్నింగ్‌

Published on Tue, 09/23/2025 - 13:49

సాక్షి, అనంతపురం: టీడీపీ నేత, మునిసిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి మరోసారి రెచ్చిపోయారు. తాడిపత్రిలో ఉద్రిక్తతలు అంటూ చూపొద్దంటూ మీడియాకు వార్నింగ్‌ ఇచ్చారు. ఈసారి అలా రాస్తే.. మీ ఇళ్ల వద్దకు వస్తానంటూ జేసీ బెదిరింపులకు దిగారు. ‘‘నా దగ్గర తమాషాలు చేయొద్దు.. నా గురించి అందరికీ తెలుసు.. మీడియా వాళ్లకు తప్పా?’’ అంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు.

తాడిపత్రిలో రోడ్డుపై పడుకుని జేసీ హల్‌చల్‌
కాగా, జేసీ ప్రభాకర్‌రెడ్డి నిన్న (సోమవారం) కూడా హల్‌చల్‌ చేసిన సంగతి తెలిసిందే. పోలీస్‌ అధికారులను బెదిరించే ధోరణిలో స్థానిక ఏఎస్పీ కార్యాలయం ఎదుట, అశోక్‌ పిల్లర్‌ సర్కిల్లో దాదాపు ఐదు గంటల పాటు మంచంపై పడుకుని నిరసన పేరిట హంగామా సృష్టించారు. పది రోజుల క్రితం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఏఎస్పీ రోహిత్‌కుమార్‌కు జేసీ ప్రభాకర్‌రెడ్డి అందజేశారు.

దీనిపై పోలీసుల నుంచి ఎలాంటి స్పందనా రాలేదంటూ సోమవారం నేరు­గా ఏఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకుని ఏఎస్పీతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఇందుకు ఏఎస్పీ సుముఖంగా లేకపోవడంతో కార్యాలయం ముందు రోడ్డుపై పడుకుని హంగామా చేశారు. అయినప్పటికీ ఏఎస్పీ పట్టించు­కోకపోవడంతో పట్టణంలోని అశోక్‌పిల్లర్‌ సర్కిల్‌కు చేరుకుని నడిరోడ్డుపై కుర్చీలో కూర్చొన్నారు. అయినా పోలీసుల నుంచి స్పందన కరువవడంతో అప్పటికప్పుడు రోడ్డుపై టెంట్‌ వేయించి.. మంచంపై పడుకున్నారు. ఉదయం 11 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఆయన హైడ్రా­మా కొనసాగింది. చివరకు జిల్లా ఎస్పీ నుంచి ఫోన్‌ రావడంతో వెనక్కి త­గ్గా­రు.

మీడియాకు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్

 

 

Videos

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)