Breaking News

తాడిపత్రిలో హైటెన్షన్‌.. జేసీ గూండాగిరి

Published on Mon, 10/20/2025 - 07:30

తాడిపత్రి టౌన్‌: అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో టీడీపీ నేత, మునిసిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి మరోసారి వీరంగం సృష్టించారు. పట్టపగలు అందరూ చూస్తుండగా.. వైఎస్సార్‌సీ­పీ నాయకుడిపై తన అనుచరులతో దాడి చేయించి తీవ్రంగా గాయపరిచారు. 

బాధితుడు తెలిపిన వివరాలు.. వైఎస్సార్‌సీపీ నాయకుడు యర్రగుంటపల్లి నాగేశ్వరరెడ్డి ఆదివారం తాడిపత్రిలోని ఆనంద్‌ భవన్‌ హో­టల్‌ వద్ద టీ తాగుతుండగా.. వాహనంలో అటుగా వెళ్తున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి చూశారు. ఆ వెంటనే ‘వీ­ణ్ని ఎందుకురా ఇంత వ­ర­కు వదిలేశారు’ అంటూ అనుచరులను రెచ్చగొట్టారు. దీంతో రవీంద్రారెడ్డి, యాసిన్, బద్రీ, విష్ణు, శేఖర్‌తో పాటు సుమారు పది మంది జేసీ అనుచరులు ఇనుప రాడ్లతో నాగేశ్వరరెడ్డిపైకి దూసుకెళ్లారు. వారి నుంచి తప్పించుకునేందుకు ప్రయతి్నంచిన నాగేశ్వరరెడ్డిని.. రోడ్డుపై వెంబడిస్తూ దాడి చేశారు. సమీపంలో వైఎస్సార్‌సీపీ నాయకురాలు పేరం స్వర్ణలత ఇల్లు కనిపించడంతో.. నాగేశ్వరరెడ్డి అందులోకి పరుగెత్తుకెళ్లి తలదాచుకున్నాడు. 

జేసీ అనుచరులు అక్కడి నుంచి వెళ్లిపోగానే.. పేరం అమరనాథ్‌రెడ్డి స్థానికులతో కలి­సి బాధితుడిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఆస్పత్రి వద్దకు చేరుకుని దాడి వివరాలను ఆరా తీశారు. జేసీ ప్రభాకర్‌రెడ్డిపై పోలీసులు చర్యలు తీసుకుంటారన్న నమ్మకం తనకు లేదంటూ.. కేసు పెట్టడానికి బాధితుడు నిరాకరించారు. కాగా, నాగేశ్వరరెడ్డిని వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫోన్‌లో పరామర్శించారు.

Videos

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)