Breaking News

Chittoor: రికార్డింగ్‌ డాన్స్‌ చేసిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

Published on Wed, 04/10/2024 - 11:24

చిత్తూరు అర్బన్‌: చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్‌మోహన్‌ నాయుడు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో అభాసుపాలవుతున్నారు. ఇటీవల ఓ బైకు నడిపిన ఆయన రెండు చేతులు వదిలేస్తూ.. జాతీయ రహదారిపై చేసిన స్టంట్లు, దాన్ని వీడియోలు తీయించి వైరల్‌ చేసిన తీరు చూసి జనం నవ్వుకున్నారు. దీనిపై యువత తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రోడ్డు భద్రతా నియమాలు పాటించకపోవడం, హెల్మెట్‌ పెట్టుకోకపోవడం, కనీసం రోడ్డుపై స్టంట్లు చేసేప్పుడు పోలీసుల అనుమతి తీసుకోవాలనే అవగాహనలేకపోవడం ఏంటని విద్యావంతుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వివాదం నుంచి బయటపడకముందే తాజాగా ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఇందులో జగన్‌మోహన్‌ నాయుడు రికార్డింగ్‌ డ్యాన్సు చూస్తూ కనిపించారు.

ఇద్దరు యువతులతో కలిసి ఆయన వేసిన కుప్పి గంతులు చూపరులకు వెగటుపుట్టస్తున్నాయి. బెంగళూరులో డిస్కోలు, పబ్బులు, మద్యం బార్లలో పిచ్చి గంతులు వేసే వ్యక్తి, బాధ్యతారహితంగా వ్యవహరించే మనిషి నాయకుడైతే ఎలా ఉంటుందో తెలుసుకోండి..! అంటూ పలువురు ఈ వీడియోలను ట్రోల్‌ చేశారు. సైకిల్‌ పోవాలి అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఈ వీడియో వైరల్‌ కావడంతో టీడీపీ కార్యకర్తలు అంతర్మథనంలో పడ్డారు. తమ అభ్యర్థి నిర్వాకాలతో పార్టీ పరువు బజారున పడిందని తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు. భవిష్యత్‌లో సదరు అభ్యర్థి ఇంకేం వీడియోలతో నవ్వులపాలు చేస్తాడో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)