Breaking News

పొత్తులో చెత్త ప్లాన్‌.. చంద్రబాబు మైండ్‌ గేమ్‌లో జనసేన బలి!

Published on Sat, 03/09/2024 - 10:38

సాక్షి, ఢిల్లీ: టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ క్రీడలో జనసేన అధినేత పవన​ కల్యాణ్‌ పావుగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పవన్‌ను బలి చేసేందుకు చంద్రబాబు మరో కొత్త ప్లాన్‌ రెడీ చేసినట్టు తెలుస్తోంది. దీంతో, జనసైనికులకు గట్టి షాక్‌ తగిలే అవకాశముంది. 

కాగా, చంద్రబాబు ఢిల్లీ వేదికగా బీజేపీతో పొత్తు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో పొత్తు ఉండాలంటే బీజేపీ తాము అడిగిన స్థానాలివ్వాలనే కండీషన్‌ పెట్టింది. దీంతో, బీజేపీ అడుగుతున్న స్థానాల విషయంలో చంద్రబాబుకు ఎదురుదెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలో చంద్రబాబు.. మరో కొత్త ప్లాన్‌ చేసినట్టు సమాచారం. 

పొత్తులో భాగంగా బీజేపీ కోరుకుంటున్న ఎంపీ సీట్లను జనసేన కోటా నుంచి తగ్గించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. టీడీపీ-జనసేన కూటమి పొత్తులో భాగంగా మూడు లోక్‌సభ, 24 అసెంబ్లీ స్థానాలను జనసేనకు కేటాయించిన విషయం తెలిసిందే. కాగా, జనసేనకు కేటాయించిన మూడు లోక్‌సభ స్థానాల నుంచే సీట్లను కట​్‌ చేసే ప్లాన్‌ చంద్రబాబు చేస్తున్నాడు. ఈ మేరకు పవన్‌ను చంద్రబాబు ఒప్పంచే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. 

ఇదిలా ఉండగా.. బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తుపై ఢిల్లీ వేదికగా సస్పెన్స్‌ కొనసాగుతోంది. బీజేపీ అగ్రనేత, హోం మంత్రి అమిత్‌ షాతో పొత్తుల విషయం చర్చించేందుకు చంద్రబాబు, పవన్‌ పడిగాపులు కాస్తున్నారు. అయితే, అమిత్‌ షా మాత్రం చంద్రబాబును పెద్దగా పరిగణనలోకి తీసుకున్నట్టు కనిపించడంలేదనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. 

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)