Breaking News

సీఎంవో డైరెక్షన్‌.. ‘బీటెక్‌’ యాక్షన్‌!

Published on Fri, 08/08/2025 - 07:06

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: ‘పులివెందుల గడ్డపై జెడ్పీ­టీసీ విజయం టీడీపీ సొంతం కావాలి...! ఏమి చేస్తారో... ఎలా చేస్తారో మీ ఇష్టం..! ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుంది.. మీకు నచ్చినట్లు యంత్రాంగాన్ని ఉపయోగించుకోండి...!’ ముఖ్యమంత్రి కార్యాలయం చేసిన ఈ డైరెక్షన్‌తో పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జి బీటెక్‌ రవి యాక్షన్‌­లోకి దిగిపోయారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలుపే లక్ష్యంగా అరాచకా­లకు తెగబ­డు­తున్నారు. అడ్డొచ్చిన వారిని అంతమొందించాలని పథక రచన చేస్తున్నారు.

అందులో భాగంగానే వైఎస్సార్‌సీపీ నేతలపై హత్యా­యత్నం ఘటనలు వరుసగా చోటు చేసు­కుంటున్నట్లు స్పష్ట­మ­వుతోంది. పచ్చ ముఠాలు పట్టపగలు మార­ణా­యుధా­లతో దాడికి తెగబడినప్పటికీ ఎమ్మెల్సీ రమేష్‌­యాదవ్‌కు గన్‌మేన్‌ సిద్ధయ్య కనీస ప్రొటెక్షన్‌ కల్పిం­చకపో­వడం గమనార్హం. గాల్లోకి కాల్పులు జరపలేదు. ఉన్నత స్థాయి ఆదేశాలతోనే గన్‌మెన్‌ మిన్నకుండిపోయినట్లు సమాచారం.

తొలుత సైదా­పురం సురేష్‌­కుమార్‌­రెడ్డి (చంటి), అమరేష్‌­రెడ్డిని టీడీపీ గూండాలు లక్ష్యంగా చేసుకోగా తర్వాత రోజు ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్,  వేల్పుల రామ­లింగారెడ్డిపై హత్యా­య­త్నం జరిగింది. ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్‌ వాహ­నాన్ని ధ్వంసం చేసి పెట్రోల్‌ పోసి తగలబెట్టే యత్నం చేశారు. ఇంత జరుగుతున్నా వాహనంలో ఉన్న ఎమ్మెల్సీ రమేష్‌­యాదవ్, వేల్పుల రామలింగారెడ్డి­లను కాపాడా­లనే ప్రయత్నం గన్‌మెన్‌ సిద్ధయ్య చేయ­కపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. 

హత్యోదంతంలో రవి కుటుంబ సభ్యులు..
ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్, వేల్పుల రామలింగారెడ్డి­లపై హత్యాయత్నం ఘటనలో స్వయంగా టీడీపీ ఇన్‌చార్జి బీటెక్‌ రవి కుటుంబ సభ్యులు పాల్గొ­న్నారు. ఆయన తమ్ముడు మారెడ్డి భరత్‌రెడ్డి, చిన్నాన్న రఘునాథరెడ్డి మారణాయుధాలు వెంట బెట్టుకొని నడిచి రాగా.. పేర్ల శేషారెడ్డి, మబ్బుచింతపల్లె శ్రీనాథరెడ్డి, విజయ్‌కుమార్‌రెడ్డి, కిరికిరి బాషా అండ్‌ ఎల్లోగ్యాంగ్‌ వేల్పుల రామును హత్య చేసేందుకు యత్నించారు. అయితే నల్లగొండువారి­పల్లె గ్రామస్తులు తిరగబడడంతో అదృష్టవశాత్తు బతికి పోయారు. 

కొమ్ము కాస్తున్న యంత్రాంగం...
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అధికార యంత్రాంగం పూర్తి ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. హత్యా యత్నానికి సంబంధించి రెండు ఘటన­ల్లోనూ తదుపరి ఎలాంటి చర్యలు లేవు. గురు­వారం కూడా టీడీపీ గ్యాంగ్‌ ఇనుప రాడ్లు వెంటబె­ట్టుకొని వాహనాల్లో యథేచ్ఛగా పులి­వెందులలో సంచరించింది. మరోవైపు బాధితు­లపైనే రివర్స్‌ కేసు నమోదు కావటాన్ని పరిశీలిస్తే పోలీస్‌ ఉన్న­తాధికారులు  ఏకపక్షంగా వ్యవహరిస్తున్నట్లు స్పష్ట­మ­వుతోంది. వైఎస్సార్‌­ï­Üపీ కీలక నేతలు ఎక్కడె­క్కడ పర్య­టిస్తున్నారు? ఎవరెవరు ఉన్నారు? ఎంతమంది ఫాలో అవుతున్నారు.

టార్గెట్‌ చేసుకున్న వ్యక్తి అక్కడ ఉన్నాడా? లేడా? తదితర సమా­చారం అంతా స్థానిక పోలీసుల ద్వారా అధి­కార పార్టీ నేతలకు ఎప్పటికప్పుడు చేరుతు­న్నట్లు సమాచారం. ఇక బ్యాలెట్‌ పేపర్‌ ముద్రిం­చడంలో కూడా మతలబు ఉన్నట్లు అనుమానాలు రేకెత్తుతు­న్నాయి. 11 మంది పోటీలో ఉన్న జెడ్పీటీసీ ఎన్నికల్లో బ్యాలెట్‌ను సింగిల్‌గా కాకుండా డబుల్‌ సైడ్‌ గుర్తులు ఇస్తూ ముద్రించేందుకు అధికారులు సిద్ధమై­నట్లు తెలుస్తోంది.

ఓటర్లను గందరగోళానికి గురి చేయాలనే ఈ ఎత్తుగడ వేసినట్లు స్పష్ట­మవు­తోంది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తుమ్మల హేమంత్‌రెడ్డి గుర్తు 1వ గడిలో ఉంది. డబుల్‌ సైడ్‌ బ్యాలెట్‌ పేపర్‌ను మడత వేయడం వల్ల ఎక్కు­వగా వైఎస్సార్‌సీపీ ఓట్లు చెల్లకుండా పోవాలనే కుయుక్తి దాగి ఉన్నట్లు అనుమా­నాలు వ్యక్తం చేస్తున్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)