Breaking News

చంద్రబాబు వెన్నులో వణుకు.. అందుకే రూట్‌ మారిందా?

Published on Mon, 03/25/2024 - 14:24

సాక్షి, చిత్తూరు: ఏపీలో ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా మారింది. ఒకవైపు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సింహంలా సింగిల్‌గా వస్తుంటే.. చంద్రబాబు మాత్రం అన్ని పార్టీలతో కలిసి కూటమిగా బయలుదేరారు. మరోవైపు.. చంద్రబాబు తనకు కంచుకోట అని చెప్పుకునే కుప్పంపైనే ఓటమి భయం వెడుతోంది. వెన్నులో వణుకు మొదలైంది. ఈ నేపథ్యంలో కుప్పంపై చంద్రబాబు దృష్టిసారించారు. 

టీడీపీ అధినేత చంద్రబాబు రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు కుప్పం చేరుకున్నారు. ఎన్నికల్లో ఓటమి భయంతో కుప్పం ఓటర్లను ఆకర్షించేందుకు వరాలను ప్రకటించబోతున్నారు. ఇక, గతంలో ఎన్నికల సమయంలో చంద్రబాబు అసలు కుప్పాన్ని పట్టించుకునేవారు. కానీ, ఈసారి మాత్రం ఎన్నికల హాడావుడి మొదలవగానే మొదటగా కుప్పంపైనే ఫోకస్‌ పెట్టారు. ఎన్నికల్లో తాను ఓడిపోతే మొదటికే మోసం వస్తుందని గ్రహించిన చంద్రబాబు కుప్పం దారి పట్టారు. 

ఇదిలా ఉండగా.. 2019 ఎన్నికల నుంచే కుప్పం నియోజకవర్గం ఓటర్లలో మార్పు కనిపించింది. గత ఎన్నికల్లోనే చంద్రబాబుకు మోజార్టీ భారీగా తగ్గింది. దీంతో బాబు సైతం షాకయ్యాడు. ఇక, తాజాగా కుప్పం నియోజకవర్గ పరిధిలో భారీగా దొంగ ఓట్లను తొలగించడంతో అటు చంద్రబాబు, ఇటు టీడీపీలో వణుకు మొదలైంది. 

మరోవైపు.. ఇటీవలి కాలంలో కుప్పం నియోజకవర్గ పరిధిలో ఎన్నిక ఎలాంటిదైనా వైఎ‍స్సార్‌సీపీ భారీ మెజార్టీతో గెలుస్తోంది. కుప్పం మున్సిపాలిటీ, స్థానిక సంస్థలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయఢంకా మోగించింది. ఇక, సీఎం జగన్‌ అందిస్తున్న సంక్షేమ పథకాలు కుప్పం ప్రజలకు దండిగా చేరుతుండటంతో ఓటర్లు సైతం మార్పును కోరుకుంటున్నట్టు బహిరంగంగానే చెబుతున్నారు. దీంతో, చంద్రబాబుతో భయం మొదలైంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)