Breaking News

టీడీపీ, బీజేపీలకు బిగ్‌ షాక్‌.. వైఎస్సార్‌సీపీలోకి కీలక నేతలు

Published on Thu, 09/25/2025 - 13:55

సాక్షి, తాడేపల్లి: ఏపీలో అధికార కూటమి పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలింది. పలువురు బీజేపీ, టీడీపీ కీలక నేతలు వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ సమక్షంలో వారి పార్టీలో చేరారు.

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలోకి పలువురు నేతలు వచ్చారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు బీజేపీకి చెందిన మురహరిరెడ్డి, కిరణ్ కుమార్.. టీడీపీకి చెందిన మధు, మల్లికార్జున్‌ వారి పార్టీలను వీడి.. వైఎస్సార్‌సీపీలో చేరారు. వైఎస్‌ జగన్‌ వారికి పార్టీ కండువా కప్పి వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు. కర్నూలు జిల్లాలో కీలక నేతలు వైఎస్సార్‌సీపీలో చేరడంతో కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగలినట్టు అయ్యింది.

వైఎస్సార్‌సీపీలో చేరిన వారిలో పీజీ రాంపుల్లయ్య యాదవ్‌ (కర్నూలు కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్ధి), మోనికా రెడ్డి (51 డివిజన్‌ టీడీపీ కార్పొరేటర్‌), నరసింహులు యాదవ్‌ (స్టాండింగ్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌), లోక్‌నాథ్‌ యాదవ్‌ (డీసీసీబీ బ్యాంక్‌ మాజీ డైరెక్టర్‌), ప్రదీప్‌ వెంకటేష్‌ యాదవ్‌ (మాజీ రైల్వే బోర్డ్‌ మెంబర్‌), షబ్బీర్‌ అహ్మద్‌, ఫైరోజ్‌ (8వ డివిజన్‌ టీడీపీ నాయకులు), పలువురు బీజేపీ నేతలు ఉన్నారు.

ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు ఎస్‌వీ మోహన్‌ రెడ్డి, కర్నూలు పార్లమెంట్‌ వైఎస్సార్‌సీపీ పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌ రెడ్డి, కర్నూలు సిటీ వైఎస్సార్‌సీపీ ప్రెసిడెంట్‌ అహ్మద్‌ అలీఖాన్‌, పలువురు కర్నూలు జిల్లా నాయకులు పాల్గొన్నారు. 

 

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)