Breaking News

చంద్రబాబుకు ఇదే నా ఓపెన్‌ ఛాలెంజ్‌

Published on Tue, 01/30/2024 - 20:45

సాక్షి, ఏలూరు:  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏ సీఎం చేయని రీతిలో దళారి వ్యవస్థ లేకుండా ప్రజలకు సంక్షేమాన్ని చేరువ చేశారని హోం మంత్రి తానేటి వనిత అన్నారు. వాలంటరీ సచివాలయ వ్యవస్థ ద్వారా వారింటికి సంక్షేమం చేరటంతో ప్రజలు సంతోషిస్తున్నారని తెలిపారు. ద్వారకాతిరుమల మండలంలో కార్యకర్తలు, నాయకుల ఆత్మీయ సమావేశంలో హోం మంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోం మంత్రి తానేటి వనిత మాట్లాడారు. 

జగనన్నకు ఓటు వేసేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఎవరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా.. ఎంతమందితో కలిసి వచ్చినా భయపడేది లేదని అన్నారు. ప్రజలు జగనన్నను ముఖ్యమంత్రిగా చేసేందుకు డిసైడ్ అయిపోయారని పేర్కొన్నారు.

‘చంద్రబాబుది విజన్ అయితే.. 2019లో ఎందుకు అది పాయిజన్ అయిందో చెప్పాలి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇన్ని సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వలేదు. అమ్మ ఒడి పథకాన్ని గతంలో ఎందుకు పెట్టలేదు. రెండువేల పైచిలుకు వ్యాధులకు ఆరోగ్య శ్రీలో చికిత్స ఎందుకు ఇవ్వలేదు. చంద్రబాబు విజన్ అంటే దోచుకోవడం దాచుకోవడమేనా?. నేను చంద్రబాబుకు  ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా.. కొవ్వూరు నియోజకవర్గంలో ఏ ఇసుక ర్యాంపు నుంచైనా నాకు నెలకు, సంవత్సరానికి గాని ఎవరైనా  ఒక్క రూపాయి అయినా నాకు ఇచ్చారనీ నిరూపిస్తే రాజకీయాల నుంచి నేను వైదొలుగుతా’ అని  తానేటి వనిత తెలిపారు.

అలాగే.. గోపాలపురం నియోజవర్గం అనేది తన స్వస్థలమని తెలిపారు. తన తండ్రి బాబాజీ రావు ఇక్కడ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని అన్నారు. ప్రజలకు తాను సుపరిచితురాలనేనని.. తనకు పుట్టింటికి వచ్చినట్లుందని హోం మంత్రి తానేటి వనిత అన్నారు.

Videos

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు