Breaking News

‘నటుడు విజయ్‌.. రాజకీయ ప్రవేశం ఇండియా కూటమికే లాభం’

Published on Sat, 11/02/2024 - 13:23

చెన్నై: తమిళగ వెట్రి కజగం(టీవీకే)చీఫ్‌, నటుడు విజయ్‌ రాజకీయాల్లోకి రావటంకాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి ప్రయోజనకరమని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్‌సీసీ)అధ్యక్షుడు కె సెల్వపెరుంతగై అన్నారు. ఇండియా కూటమి మిత్రపక్షాలకు నటుడు విజయ్‌ అధికార భాగస్వామ్యం ఆఫర్ ఇవ్వటంపై ఆయన మీడియాతో మాట్లాడారు.

‘‘విజయ్ రాజకీయ ప్రవేశం రాబోయే రోజుల్లో తమిళనాడు రాజకీయ రంగంలో ఎటువంటి మార్పులు తీసుకురాదు. ఆయన రాజకీయ ప్రవేశం ఇండియా కూటమి విజయానికి  ఉపయోగపడుతుంది. 2026 అసెంబ్లీ ఎన్నికలలో ఓట్లను, ముఖ్యంగా ప్రతిపక్ష ఓట్లను విజయ్‌ పార్టీ చీల్చుతుంది. విజయ్‌ అధికార భాగస్వామ్యం ఆఫర్‌ ఇండియా కూటమి మిత్రపక్షలు ఎటువంటి అలజడికి గురికాలేదు. 

ఇండియా కూటమి బలంగానే ఉంది. కాంగ్రెస్ 2004-2014 మధ్య కేంద్రంలో అధికారాన్ని పంచుకుంది. దాని ఆధారంగా.. మేం అధికారం పంచుకునే ఆలోచనతో అంగీకరిస్తున్నాం. అయితే అధికారాన్ని పంచుకోవడంపై జాతీయ నాయకత్వందే తుది నిర్ణయం. 2006 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏ పార్టీకి సాధారణ మెజారిటీ రాలేదు. కాంగ్రెస్ మద్దతుతో మాత్రమే ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. 

సోనియా గాంధీ మార్గదర్శకత్వంలో.. ప్రభుత్వ ఏర్పాటులో డీఎంకేకు కాంగ్రెస్ పార్టీ బేషరతుగా మద్దతు ఇచ్చింది. అధికారంలో వాటా కావాలని కాంగ్రెస్ డిమాండ్ చేసి ఉంటే అప్పటి సీఎం కరుణానిధి ఇచ్చి ఉండేవారు. కానీ కాంగ్రెస్ అధికారంలో వాటా కోరలేదు. అధికార భాగస్వామ్యం ప్రజల ఆదేశంపై ఆధారపడి ఉంటుంది. ప్రతి రాజకీయ పార్టీ అధికారం చేజిక్కించుకోవాలని కోరుకుంటుంది. మేం తమిళనాడులో కామరాజ్ పాలనను ప్రారంభిస్తాం’ అని అన్నారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)