విజయ్‌.. అధికార మత్తులో మర్చిపోయారా?: స్టాలిన్‌

Published on Sun, 06/14/2026 - 07:49

తమిళనాడు రాజకీయాల్లో అధికార తమిళగ వెట్రి కళగం, ప్రతిపక్షం డీఎంకే మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు ముదురుతోంది. చెన్నైలోని అన్నా అరివాలయంలో శనివారం జరిగిన డీఎంకే మహిళా విభాగం లోక్‌సభ కార్యకర్తల సన్నాహక సమావేశంలో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ సీఎం  విజయ్‌ను టార్గెట్‌ చేసి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సీబీఐ కేసుల నుంచి తప్పించుకోవడానికే తమరు ఢిల్లీ వెళ్లారా?, బీజేపీని గట్టిగా విమర్శిస్తే తమరి కుర్చీకి ముప్పు వస్తుందని భయపడుతున్నారా? అంటూ స్టాలిన్‌  ప్రశ్నలు సంధించారు.

డీఎంకే మహిళా విభాగం సమావేశంలో స్టాలిన్‌ టీవీకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా గత ఐదేళ్ల డీఎంకే ద్రావిడ మోడల్‌ పాలన మహిళల సంక్షేమమే ధ్యేయంగా సాగిందన్నారు. అయితే, ప్రస్తుత టీవీకే ప్రభుత్వంలో రోజురోజుకూ పెరుగుతున్న నేరాలు, విద్యుత్‌ కోతలు, రైతుల రుణాల మాఫీ నాటకాలతో.. ఈ ప్రభుత్వానికి ఎందుకు ఓటేశామా.? అని ప్రజలు తీవ్ర ఆగ్రహంతో, ఆవేదనతో ఉన్నారని పేర్కొన్నారు. ఎన్నికల ముందు మహిళల భద్రత గురించి మాట్లాడిన సీఎం విజయ్‌.. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న మహిళలపై దాడుల్లో మెజారిటీ కేసుల్లో టీవీకే నిర్వాహకులే నిందితులుగా ఉన్నారని వార్తలు వస్తున్నాయని వివరించారు. ఇప్పుడు టీవీకే నుంచి మహిళలకు రక్షణ కావాలని ప్రజలు కోరే పరిస్థితి వచ్చిందన్నారు.

డీఎంకే బ్లూప్రింట్‌ కాపీ కొట్టారు 
ఇటీవల ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్‌ సమావేశానికి సీఎం విజయ్‌ హాజరు కావడంపై స్టాలిన్‌ స్పందించారు. ఇందులో  సీఎం ప్రసంగం అంతా గతంలో డీఎంకే ప్రభుత్వం సాధించిన విజయాలు, రాష్ట్ర హక్కుల కోసం తాము రూపొందించిన పాలసీ నోట్‌ లాగే ఉందని ఎద్దేవా చేశారు. ఇది సినిమా కాదు.. రాష్ట్ర పరిపాలన, రాష్ట్ర హక్కుల విషయంలో ద్రావిడ మోడల్‌ ప్రభుత్వం వేసిన బ్లూప్రింట్‌ ప్రకారమే ఎవరైనా నడవాల్సిందేనని స్పష్టం చేశారు.  తాను  గతంలో 2030 నాటికి 1 ట్రిలియన్‌ డాలర్‌ ఎకానమీ అని చెప్తే.. విజయ్‌ మాత్రం  కాస్తమెరుగు దిద్ది  మార్చి 2036 నాటికి ఒకటిన్నర ట్రిలియన్‌ డాలర్‌ ఎకానమీ అని మాట్లాడారని గుర్తు చేశారు.  ఏదేమైనా అందుకు నా అభినందనలు అని వ్యాఖ్యలు చేశారు.  

కార్యకర్తలకు పిలుపు 
గతంలో తాను సీఎంగా  ఉన్నప్పుడు ఢిల్లీ వెళ్తే.. ఇరుపక్షాలు ఎల్‌కేజీ, యూకేజీ పిల్లల్లా కొట్టుకుంటున్నాయని ఎగతాళి చేసిన విజయ్, ఇప్పుడు నిబంధనలు లేకుండా నిధులు ఇవ్వాలని అదే ఢిల్లీ పెద్దలను కోరి వచ్చారని ఎద్దేవా చేశారు. ఈ విషయాలన్నింటినీ డీఎంకే మహిళా విభాగం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని స్టాలిన్‌ పిలుపునిచ్చారు. పార్టీ స్థాపకుడు కరుణానిధి చెప్పినట్లుగా పార్టీ అనేది తల, అధికారం అనేది కిరీటం అని , అయితే,  తల ఉంటే కిరీటాన్ని ఎప్పుడైనా ధరించవచ్చు అని గుర్తు చేస్తూ, డీఎంకే పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.  

బీజేపీకి జిరాక్స్‌ కాపీలా విజయ్‌ పాలన.. 
సీఎం విజయ్‌ ప్రస్తుతం బట్టల షాపింగ్‌ తరహాలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను కొనేస్తున్నారని ఆరోపించారు. తన ప్రభుత్వంపై తనకే నమ్మకం లేక, మొదట అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో తనకు అనుకూలంగా ఓటు వేయించుకున్నారన్నారు. ఇప్పుడు వారితో రాజీనామాలు చేయించి వెంటనే తన   పార్టీలో చేర్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ ఇతర రాష్ట్రాల్లో చేస్తున్న దాన్నే ఇక్కడ విజయ్‌ చేస్తున్నారని, విజయ్‌ పూర్తిగా బీజేపీకి జెరాక్స్‌ కాపీలా వ్యవహరిస్తున్నారన్నారని అన్నారు. 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)