Breaking News

అమిత్‌ షాకు సీఎం స్టాలిన్‌ చురకలు

Published on Mon, 06/12/2023 - 16:20

చెన్నై: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ చురకలు అంటించారు. ప్రధాని మోదీపై ఎందుకంత కోపంతో ఉన్నారంటూ అమిత్‌ షాను ఉద్దేశించి వెటకారంగా ప్రశ్నించారాయన. 

ఆదివారం తమిళనాడు బీజేపీ కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఆ భేటీలో పార్టీ కోసం కష్టపడాలని.. భవిష్యత్తులో తమిళనాడుకు చెందిన ఎవరైనా ప్రధాని అయ్యేలా కృషి చేయాలంటూ కార్యకర్తలను ఉద్దేశించి పిలుపు ఇచ్చినట్లు కథనాలు వెలువడ్డాయి. దీనిపై సేలంలో ఇవాళ సీఎం స్టాలిన్‌ స్పందించారు. ఆయన(షాను ఉద్దేశించి..) తన కార్యకర్తలకు ఇచ్చిన సలహాను స్వాగతిస్తున్నా. కానీ, మోదీ మీద ఆయన ఎందుకంత కోపంగా ఉన్నారో తెలియడం లేదు అంటూ వ్యాఖ్యానించారు. 

అంతేకాదు.. ఒక తమిళ వ్యక్తి ప్రధాని కావాలనే ఆలోచనే బీజేపీకి ఉంటే.. తమిళిసై సౌందరరాజన్ (తెలంగాణ గవర్నర్), ఎల్ మురుగన్ (కేంద్ర మంత్రి) లాంటి వాళ్లు ఉన్నారు కదా. వాళ్లకు ప్రధానమంత్రి అభ్యర్థులుగా అవకాశం వస్తుందని భావిస్తున్నాను అంటూ వ్యాఖ్యానించారు సీఎం స్టాలిన్‌. 

ఇక ఇదే సమావేశంలో అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలపైనా స్టాలిన్‌ స్పందించారు. గతంలో తమిళనాడు నుంచి ఇద్దరు రాజకీయ ప్రముఖులను ప్రధానులు కాకుండా డీఎంకే అడ్డుకుందని షా వ్యాఖ్యానించినట్లు ప్రచారం బయటకు వచ్చింది. ఆ వాదనను ఖండించిన స్టాలిన్‌.. షా గనుక బయట ఆ ప్రకటన చేస్తే దానికి డీఎంకే సమూలంగా వివరణ ఇస్తుందంటూ ప్రకటించారు. అలాగే.. నిధుల విషయంలో తమిళనాడుపట్ల కేంద్రం ప్రదర్శిస్తున్న వైఖరిపైనా స్టాలిన్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: పవార్‌పై అలిగాడా? ఆయన చెప్పడా?

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)