Breaking News

కాంగ్రెస్‌ నేతలను తిరగనివ్వం.. తలసాని మాస్‌ వార్నింగ్‌

Published on Wed, 07/19/2023 - 13:43

సాక్షి, హైదరాబాద్‌: టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిపై బీఆర్‌ఎస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో​ బీసీలను కించపరుస్తూ మాట్లాడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఫైరయ్యారు. రాష్ట్రంలో బీసీలమందరం ఏకమవుతున్నామని స్పష్టం చేశారు. ఎ‍క్కువగా మాట్లాడితే తెలంగాణ గ్రామాల్లో కాంగ్రెస్‌ నేతలను తిరగనివ్వమని వార్నింగ్‌ ఇచ్చారు.

కాగా, తెలంగాణలో బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. అనంతరం, మంత్రి తలసాని మీడియాతో మాట్లాడుతూ.. నోరుందని ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదు. అన్నీ బీసీ కులాల నాయకులను పిలిపించి చర్చిస్తాం. బీసీ నేతలై వ్యక్తిగత దాడులు చేస్తే ఊరుకునే ప్రస్తకే లేదు. బీసీల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడొద్దు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను ఏకం చేస్తాం. కుల వృత్తుల సమస్యలు, బాధలు మాకు తెలుసు. భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తున్నాం. బాడీషేమింగ్‌ చేస్తే బాగోదు. హైదరాబాద్‌ నగరంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తాం. 

కాంగ్రెస్ పార్టీ ఇలాంటి మాటలు నేర్పిందా?
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత ఆత్మగౌరవ భవనాలు నిర్మించాం. రైతు బంధు, రైతు బీమా మెజారిటీ బీసీలకు అందుతోంది. కాంగ్రెస్ పార్టీ విధానమా.. సొంత ఎజెండనా అర్ధం కావడం లేదు. బీసీలను కించపరుస్తూ మాట్లాడుతున్నారు. మీ పార్టీ విధానం కదా చెప్పాలి. గ్రామల్లో కాంగ్రెస్ నాయకులను తిరగకుండా చేస్తాం. ప్రజలకు సేవా చేయాలనీ చిన్న సమాజం నుంచి వచ్చిన నాయకులం మేము. 130 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఇలాంటి మాటలు నేర్పిందా? అని ప్రశ్నించారు. వ్యక్తి గత భాష ఏంటి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మేము తెగిస్తే దేనికైనా సిద్ధం. ఒక పద్ధతిగా ఉండాలని సైలెంట్‌గా ఉన్నాం. మమ్మల్ని నమ్మిన వాళ్లు ప్రతీ ఒక్కరు బాధ పడుతున్నారు అంటూ కామెంట్స్‌ చేశారు. 

ఇది కూడా చదవండి: తెలంగాణలో గెస్ట్‌ లెక్చరర్ల నియామకానికి గ్రీన్‌ సిగ్నల్‌.. జీతం ఎంతంటే?

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు