Breaking News

బీజేపీతో పొత్తు డౌటేనా?.. నేడు ఢిల్లీకి బాబు, పవన్‌

Published on Thu, 03/07/2024 - 08:09

సాక్షి, ఢిల్లీ: బీజేపీ, టీడీపీ పొత్తుపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు వ్యవహారం గందరగోళం మారింది. నిన్న అర్థరాత్రి బీజేపీ హైకమాండ్‌తో అభ్యర్థులు ఎంపికపై ఏపీ బీజేపీ నేతలు చర్చలు జరిపారు.

పొత్తులపై ఎలాంటి చర్చ జరగలేదని ప్రకటించిన పురంధేశ్వరి.. ఈరోజు మరోసారి హై కమాండ్‌తో సమావేశమవుతామని వెల్లడించారు. ఇక, ఆమె వ్యాఖ్యలతో టీడీపీ-బీజేపీ పొత్తుపై మరోసారి చర్చ మొదలైంది. అయితే, టీడీపీ మాత్రం మరో విధంగా వ్యవహరిస్తోంది.  బీజేపీతో పొత్తులో భాగంగా ఐదు ఎంపీ సీట్లు, 11 అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు రెడీ అంటూ లీకులు ఇస్తోంది. అటు బీజేపీ మాత్రం.. 175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లకు అభ్యర్థులను బీజేపీ తయారు చేస్తుంది.

ఈ క్రమంలో నేడు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ ఢిల్లీలో పర్యటించనున్నారు. నేడు పొత్తులపై  క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అర కొర సీట్లతో పొత్తుల వల్ల బీజేపీకి ఒరిగేదేమీ లేదని ఏపీ బీజేపీ నేతలు అంటున్నారు. ఎలక్షన్ మేనేజ్‌మెంట్‌ కోసమే తప్ప, బీజేపీకి లాభం చేసేందుకు టీడీపీ పొత్తు పెట్టుకోవడం లేదనే చర్చ జరుగుతోంది. కాగా, చంద్రబాబు మార్కు రాజకీయాలు అన్నీ తెలిసిన బీజేపీ అధిష్టానం పొత్తులపై ఆచితూచి అడుగులు వేస్తోందని సమాచారం.

ఇక, టీడీపీని బీజేపీ చీదరించుకుంటున్నా చంద్రబాబు పొత్తుల కోసం పాకులాడుతున్నారు. బీజేపీని చంద్రబాబు, పవన్‌ బతిమాలే పరిస్థితికి వచ్చారు. మరోవైపు, చంద్రబాబును ఢిల్లీకి బీజేపీ ఆహ్వానించిందంటూ ఎల్లో మీడియా కథనాలు వండి వార్చుతోంది. బీజేపీతో టీడీపీ-జనసేన కూటమి పొత్తు వ్యవహారం ఢిల్లీకి చేరడంతో బీజేపీతో పొత్తు సంగతి తేలిన తర్వాతే టీడీపీ -జనసేన సెకండ్ లిస్ట్ విడుదల చేయాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ నిర్ణయానికి వచ్చారు.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి