Breaking News

చంఢీగఢ్‌ మేయర్‌ ఎన్నికలు: సుప్రీం కోర్టు సీరియస్‌

Published on Mon, 02/05/2024 - 17:55

చంఢీగఢ్‌: చంఢీగఢ్‌లో మేయర్‌ ఎన్నికల వివాదంపై సుప్రీం కోర్టు సీరియస్‌ అయింది. మేయర్‌ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని బీజేపీ కౌన్సిలర్‌ మనోజ్‌ సోంకర్‌ చేతిలో ఓటమి పాలైన ఆప్‌ కౌన్సిలర్‌ కుల్దీప్‌ ధరోర్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. మేయర్‌ ఎన్నికలకు సంబంధించిన బాలెట్‌ పేపర్లు, ఒరిజినల్‌ రికార్డులు, వీడియో ఫుటేజీని పంజాబ్‌, హర్యానా కోర్టు  రిజిస్ట్రార్‌కు అందజేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.

చంఢీగఢ్‌ మేయర్‌ ఎన్నికల్లో రిటర్నింగ్‌ అధికారి బాలెట్‌ పేపర్లను తారుమారు చేశారని స్పష్టంగా తెలుస్తోంది? ఈ చర్యతో అతను ప్రజాస్వామ్యాన్ని హత్య చేయటానికి ప్రయత్నించారా? అని సుప్రీంకోర్టు సీరియస్‌ అయింది. ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడానికి తాము అనుమతించమని సుప్రీంకోర్టు పేర్కొంది.

చంఢీగఢ్‌ మేయర్‌ ఎన్నికల్లో చోటుచేసుకున్న అవకతవకలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటమేనని పేర్కొంది. ఇక.. ఫిబ్రవరి 7న జరగాల్సిన చంఢీగఢ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ సమావేశాన్ని వాయిదా వేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణను  సుప్రీం కోర్టు తిరిగి ఫిబ్రవరి 12కు వాయిదా వేసింది. 

చంఢీగఢ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పోలింగ్‌లో మొత్తం 36 ఓట్లు ఉండగా.. బీజేపీ మేయర్‌ అభ్యర్థికి 16 ఓట్లు, ఆప్‌ అభ్యర్థికి 12 ఓట్లు వచ్చాయి. 8 మంది ఆప్‌-కాంగ్రెస్‌ సభ్యుల ఓట్లు చెల్లవని ప్రకటించారు. ఈ ఫలితాలపై ఆప్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ మోసపూరితంగా ఈ ఎన్నికల్లో గెలిచిందని మండిపడింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)