Breaking News

ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్‌సీపీనే: సుబ్రహ్మణ్య స్వామి

Published on Tue, 02/25/2025 - 13:48

అమరావతి, సాక్షి: ఏపీలో ప్రధాన ప్రతిపక్ష హోదా వైఎస్సార్‌సీపీకే దక్కాలని బీజేపీ ఫైర్‌బ్రాండ్‌, ప్రముఖ లాయర్‌ సుబ్రహ్మణ్య స్వామి (Subramanian Swamy) అంటున్నారు. ఇటీవల తిరుపతి డిప్యూటీ మేయర్‌ ఎన్నిక సందర్భంగా జరిగిన హింసపై ఆయన కోర్టుకెక్కారు. ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే మీడియాకు వెల్లడించారు.

‘‘తిరుపతి డిప్యూటీ మేయర్‌ ఎన్నిక(Tirupati Deputy Mayor Election) సందర్భంగా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. చాలామందిని భయపెట్టి దాడులు చేశారు. ఎన్నికల సమయంలో హింసను నివారించేందుకు తీవ్రమైన చర్యలు తీసుకోవాలి అని పిల్‌ వేశా. నేను వేసిన పిల్‌ మార్చి 12వ తేదీన విచారణకు వస్తుంది’’ అని మీడియాకు తెలిపారాయన. తిరుపతి ఘటనలో కేవలం ఎఫ్‌ఐఆర్‌ మాత్రమే వేశారని, ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారాయన. ఈ విషయంపై కోర్టు చర్యలు తీసుకుంటే.. దేశవ్యాప్తంగా ఇదొక చట్టంగా మారుతుంది అని సుబ్రహ్మణ్య స్వామి అభిప్రాయడ్డారు.

వైఎస్ఆర్ సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి: సుబ్రమణ్యస్వామి



ప్రధాన ప్రతిపక్ష హోదా వైఎస్సార్‌సీపీదే
ఏపీలో ప్రతిపక్షంలో ఒక్క వైఎస్సార్‌సీపీ(YSRCP)నే ఉంది. కాబట్టి  ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష(Principal Opposition) హోదా ఇవ్వడంలో ఎలాంటి తప్పులేదు. అసెంబ్లీలో తక్కువ మంది ఎమ్యెల్యేలు ఉన్నా వైఎస్సార్‌సీపీకి ఆ హోదా దక్కాల్సిందే అని స్పష్టం చేశారాయన. ఈ క్రమంలో ఆయన మరికొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

👉తిరుపతి లడ్డూ అంశం(Tirupati Laddu Controversy) ముగిసిపోయింది. కల్తీలాంటి అంశాలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. తిరుపతి లడ్డూను కల్తీ చేయాలని నిజమైన భక్తులు ఎవరూ అనుకోరు.  

👉మంచి విషయం ఎవరు చెప్పినా పార్టీలకతీతంగా అంగీకరించాలి. నా నిర్ణయాలను పార్టీ ఎన్నడూ వ్యతిరేకించలేదు అని అన్నారాయన.  ఇదిలా ఉంటే.. ఏపీ కూటమి ప్రభుత్వం (AP Kutami Prabhutvam)లో బీజేపీ భాగమై ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు దారి తీసే అవకాశం లేకపోలేదు. 

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు