Breaking News

మంత్రిని ఆహ్వానించడానికి విద్యార్థులే దొరికారా?

Published on Sun, 07/09/2023 - 16:15

ముంబై: మహారాష్ట్రలో అజిత్ పవార్ తిరుగుబాటు బృందం నుండి మంత్రి వర్గంలో కొత్తగా చేరిన అనిల్ భైడాస్ పాటిల్ సొంతూరు అమల్నెర్ తిరిగి వస్తున్న క్రమంలో ఆయనను స్వాగతించేందుకు స్కూలు పిల్లల్ని రోడ్డుకు ఇరువైపులా రెండు గంటల పాటు అమానుషంగా నిలబెట్టారు.     

అజిత్ పవార్ నేతృత్వంలో ఎన్సీపీలోని ఒక వర్గం తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. ఆ బృందంలో అనిల్ భైడాస్ పాటిల్ మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనిల్ మొదటిసారి ఆయన సొంతూరు అమల్నెర్ తిరిగొస్తున్న నేపథ్యంలో ఆయనను స్వాగతించడానికి స్థానిక ఆశ్రమశాల పాఠశాల పిల్లల్ని రోడ్డుకు ఇరువైపులా నిలబెట్టారు ఆ స్కూలు టీచర్లు. 

మంత్రి కాన్వాయ్ రావడం ఆలస్యం కావడంతో పిల్లలు అలాగే మంచినీళ్లు కూడా తాగడానికి లేనిచోట రెండు గంటలపాటు అలాగే కూర్చుని ఎదురుచూశారు. తీరా చూస్తే చాలాసేపు నిరీక్షణ తర్వాత వచ్చిన మంత్రి పిల్లలకు కనీసం అభివాదమైనా చేయకుండా వెళ్లిపోయారు.  

మంత్రి గారిని స్వాగతించడానికి పిల్లల్ని నిలబెట్టడమేమిటని శరద్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర పాటిల్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పిల్లల పట్ల మంత్రి తీరు అమానుషమని దీనిపై వెంటనే విచారణ జరిపిస్తామని తెలిపారు జల్గావ్ జిల్లా అధికారులు. ఇదిలా ఉండగా తనకోసం చేసిన ఈ ఏర్పాట్ల గురించి తనకసలు తెలియదని అనిల్ పాటిల్ అన్నారు.        

ఇది కూడా చదవండి: స్విమ్మింగ్ పూల్ గా మారిన రైల్వే స్టేషన్ 

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)