Breaking News

పింఛన్లపై ఫిర్యాదు చేస్తే దాడి చేస్తారా?

Published on Sun, 07/07/2024 - 04:15

గుంటూరు/భీమవరం: ‘పింఛన్లపై ఫిర్యాదు చేస్తే దాడి చేస్తారా? ఇళ్ల వద్ద పింఛన్లు ఇవ్వమనడం త­ప్పా?’ అంటూ టీడీపీ నాయకత్వంపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజక­వర్గం పరగ­టిచర్లలో ఇటీవల లబ్ధిదారులకు ఇళ్ల వద్దే ఇవ్వాల్సిన ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లను.. తమ ఇళ్ల వద్దకు వచ్చి తీసుకోవాలంటూ టీడీపీ నేతలు చాటింపు వే­యించా­రు.

దీనిపై సీపీఎం నాయకుడు కామినేని రామా­రావు పల్నాడు కలెక్టరేట్‌లో ఫిర్యా­దు చేశారు. దీంతో కక్ష పెంచుకున్న టీడీపీ నేతలు శుక్ర­వారం మూ­కు­మ్మడిగా రామారావు ఇంటిపై దాడి చేశారు. వృద్ధురా­లైన ఆయన తల్లిని విచ­క్షణారహి­తంగా పక్కకు నె­ట్టేసి.. దాడి చేయడంతో రామా­రావు తీవ్రంగా గా­యç­³డ్డారు. స్థానికులు ఆయన్ని నరసరావుపేట ఏరి­యా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసు­కున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు శనివారం రామా­రావును పరామర్శించి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు.

ఆస్పత్రి నుంచి డీఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి అదనపు ఎస్పీ లక్ష్మీపతికి శ్రీని­వాసరావు వినతిపత్రమిచ్చారు. నిందితులను అరెస్ట్‌ చేయాలని, బాధితుడికి రక్షణ కల్పించాలని కోరారు. శ్రీనివాస రావు మీడి­యాతో మాట్లాడుతూ.. ‘టీడీపీ నేతలు 70 ఏళ్ల వయసున్న రామా­రావుపై దాడి చేయ­డం దారుణం. అడ్డువచ్చి­న ఆయన తల్లి(90)ని కూడా పక్కకు నెట్టే­శారు. ఈ దాడిని ఖండిస్తున్నాం. సీఎం చంద్రబాబు వెంటనే స్పందించి తమ పార్టీ వర్గీయులను అదుపులో పెట్టుకోవాలి. దాడులు ఆపకపోతే ఏం చేయాలో మాకు తెలుసు’ అంటూ హెచ్చరించారు. 

ప్రత్యేక హోదాపై ఎందుకు ప్రశ్నించట్లేదు?
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని అడిగే అవకాశమున్నా ఎందుకు జంకుతున్నారని సీఎం చంద్రబాబును శ్రీనివా­సరావు ప్రశ్నించారు. శని­వారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, విశాఖ ఉక్కు పరిరక్షణ గురించి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అడుగుతారని చంద్రబాబును ప్రశ్నించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)