లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంక పోటీకి దూరం!

Published on Tue, 04/30/2024 - 10:33

కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంది. మరోవైపు.. ఉత్తర​ప్రదేశ్‌లో కీలకమైన అమేథీ, రాయ్‌ బరేలీ స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయటంతో కాంగ్రెస్‌  పార్టీ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈ రెండు స్థానాల్లో అభ్యర్థుల ఖరారు నిర్ణయాన్ని కాంగ్రెస్‌ నేతలు.. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు వదిలిపెట్టారు. 

ఈ క్రమంలో ఈ రెండు స్థానాల్లో ఏదో ఒక చోట ప్రియాంకా గాంధీ లేదా ఆమె భర్త రాబర్ట్‌ వాద్రా, మరో స్థానంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ బరిలో​కి దిగుతారని వార్తలు వస్తున్నాయి.  అయితే ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంకా గాంధీ పోటీ చేయవద్దని నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. 

ప్రియాంకా గాంధీ లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయకుండా.. కేవలం కాంగ్రెస్‌ పార్టీ గెలుపు కోసం ఎన్నికల ప్రచారం చేయటానికి పరిమితం కానున్నట్లు సమాచారం. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీకి కీలకమైన అమేథీ, రాయ్‌ బరేలీలో ఏదో ఒక చోట రాహుల్‌ గాంధీ పోటీ దిగే నిర్ణయాన్ని అదిష్టానం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు... యూపీకి చెందిన పలువురు కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా ఉత్తరప్రదేవ్‌లో పోటీ చేయాలని కోరుతున్నారు. 

అమేథీ స్థానంలో మూడుసార్లు గెలిచిన రాహు​ల్‌ మళ్లీ ఇక్కడ పోటీ చేస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రియాంకా గాంధీ రాయ్‌బరేలీలో పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే  అమేథీ, రాయ్‌బరేలీ రెండు స్థానాలు కాంగ్రెస్‌కు కంచుకోట. ఇక.. ఇక్కడ ఐదో విడతలో మే 20న పోలింగ్‌ జరగనుంది.

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)