Breaking News

కారెక్కనున్న సోమారపు?

Published on Wed, 10/25/2023 - 03:58

గోదావరిఖని: రామగుండం నియోజకవర్గానికి చెందిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ కారెక్కనున్నట్లు తెలుస్తోంది. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుతో వేర్వేరుగా భేటీ అయినట్లు సమాచారం. తనకు పార్టీ టికెట్‌ ఇస్తే కచ్చితంగా గెలుస్తానని.. ప్రస్తుతం పోటీలో ఉంటున్న నాయకుడికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని సోమారపు ప్రతిపాదించినట్లు తెలిసింది.

కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే టికెట్‌ కోసం ఢిల్లీ వెళ్లిన ఆయనకు.. పార్టీ అధిష్టానం నుంచి సానుకూల సాంకేతాలు రాలేదు. దీంతో నియోజకవర్గానికి చేరుకొని స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు. అందుకు అనుగుణంగా ప్రచారం కూడా చేపట్టారు. ఆయన మంగళవారం అకస్మాత్తుగా ప్లేట్‌ ఫిరాయించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే బీఆర్‌ఎస్‌ మాత్రం ఆ నాయకుడికి ఎమ్మెల్సీ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. 

కాంగ్రెస్, టీడీపీ,బీఆర్‌ఎస్, బీజేపీ.. మళ్లీ బీఆర్‌ఎస్‌.. 
1998లో జరిగిన రామగుండం మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా రాజకీయ అరంగేట్రం చేసిన సోమారపు... ఆ తర్వాత 2004 అసెంబ్లీ ఎన్నికల్లో మంథని టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడారు. అటునుంచి తిరిగి కాంగ్రెస్‌లో చేరి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో రామగుండం నుంచి గెలుపొందారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ (నాటి టీఆర్‌ఎస్‌)లో చేరి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో రామగుండం నుంచి మళ్లీ గెలిచారు.

కానీ 2018 ఎన్నికల్లో మాత్రం ఓటమిపాలయ్యారు. అనంతరం బీజేపీలో చేరారు. ఆ తర్వాత బీజేపీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటానని ప్రకటించారు. ఆ తర్వాత కొద్దిరోజులకే ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్‌ నేతలను కలిశారు. ఎమ్మెల్యే టికెట్‌పై కాంగ్రెస్‌ నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రాకపోవడంతో మళ్లీ ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటూ ప్రచారం చేశారు. మంగళవారం అకస్మాత్తుగా హైదరాబాద్‌ వెళ్లి బీఆర్‌ఎస్‌ అధిష్టానంతో చర్చలు జరిపారు.  
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)