Breaking News

PK: పిఠాపురం గోళీలు పని చేయట్లేదా?

Published on Fri, 04/05/2024 - 10:15

కాకినాడ, సాక్షి: జనసేన విషయంలో పవన్‌ కల్యాణ్‌ చేస్తున్నదంతా పదేళ్లుగా ఆ పార్టీని వెంటపెట్టుకుని తిరిగిన వాళ్లెవరికీ సహించడం లేదు. సీఎం అవుతాడని కలలుగన్న అభిమానుల ఆశలు పటాపంచల్‌ చేస్తూ మళ్లీ చంద్రబాబుతోనే పొత్తుకు వెంపర్లాడడం.. ఇటు రాజకీయ వర్గాలను సైతం విస్మయానికి గురి చేసింది.  గత ఎన్నికల్లో 130 ఫ్లస్‌ సీట్లకు పోటీ చేసిన జనసేన.. ఇప్పుడు 21 స్థానాలకే పరిమితం కావడాన్ని జనసేన కేడర్‌ జీర్ణించుకోలేకపోతోంది. 

పోనీ ఆ 21 సీట్ల కేటాయింపులో అయినా జెన్యూన్‌గా ఉన్నాడా? అంటే అదీ లేదు. కనీసం రెండు పదుల స్థానాలకు అభ్యర్థుల్ని సైతం ఎంపిక చేయలేని పరిస్థితికి దిగజారిపోయాడు పవన్‌. అదే సమయంలో.. చంద్రబాబు సూచనల మేరకు టీడీపీ నుంచి పార్టీ మారిన వాళ్లకు.. అధికార వైఎస్సార్‌సీపీ ఫిరాయించిన వాళ్లకు సీట్లిచ్చి ఆయా స్థానాల్లో పాతుకుపోయిన జనసేన కేడర్‌ నుంచి విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో రాజీనామాల పర్వంతోనూ పవన్‌కు నిరసన తగిలింది. 

పోనీ తన సీటు విషయంలో అయినా కచ్చితత్వం ప్రదర్శిస్తున్నాడా? అంటే అదీ లేదు. అసలు పిఠాపురంలో పోటీ చేయడం పవన్‌ నామినేషన్‌ వేసే దాకా అనుమానమే అనే పరిస్థితిని తీసుకొచ్చారు ఇప్పుడు. భీమవరం, గాజువాక ఓటర్లకు భరోసా ఇవ్వలేకపోయిన పవన్‌.. ఇప్పుడు పిఠాపురం ఓటర్లకు ఏం భరోసా ఇస్తాడనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

వారాహి పేరిట ఎన్నికల ప్రచారం మొదలుపెట్టి రెండ్రోజులు మామూలు హడావిడి చేయలేదు. బహిరంగ సభతో పాటు ఆటోలెక్కి రోడ్ల మీద ఓ హడావిడి చేశాడు. అదేంటో.. ఆ రెండ్రోజులు తిరగక మునుపే జ్వరం పేరుతో నియోజకవర్గాన్ని వీడారు. పార్టీ నిర్వహణను నాదెండ్ల మనోహర్‌కు.. నియోజకవర్గ ప్రచార బాధ్యతలను తనపై గుర్రుగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మకు అప్పగించారు. అంటే పిఠాపురంలో గెలుపుపై పవన్‌ ఆశలు వదిలేసుకున్నట్లేనా?.. ఆ మాత్రం జ్వరానికి పవన్‌కు పిఠాపురంలో గోళీలు దొరకవా? అనే కామెంట్లు వినిపిస్తు‍న్నాయి నియోజకవర్గంలో.  

చంద్రబాబుకి బానిసత్వం ప్రదర్శించడంలో పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు ఆల్‌ టైం రికార్డు సృష్టిస్తున్నారు. ఎన్నికల వేళ పార్టీని పూర్తిగా చంద్రబాబు చేతిలో పెట్టారు. బాబు నుంచి వెన్నుపోటు రాజకీయం నేర్చుకుని దానిని జనసేన కేడర్‌పైనే ప్రయోగిస్తున్నారు.  తన చుట్టూరా ఎప్పుడూ బౌన్సర్లను ఉంచుకునే పవన్‌.. పార్టీ నేతలు, కార్యకర్తలు సహా ఎవరినీ దగ్గరకు రానీయకుండా జాగ్రత్తపడుతుంటారు. అలాంటిది పార్టీ మీటింగ్‌లలో తనపై బ్లేడ్‌లతో దాడి జరిగిందంటూ  ఆరోపణలకు దిగడం మరో కొసమెరుపు.  ఈ ఆరోపణల్ని జనసేన శ్రేణులు సైతం స్వాగతించడం లేదు. పోనీ దాడికి సంబంధించిన ఆధారాలు ఏమైనా చూపించారా? అంటే అదీ లేదు. ఇక.. ప్యాకేజీ స్టార్‌, దత్తపుత్రుడు అనే ట్యాగ్‌లకు అదనంగా ఇప్పుడు అదనంగా బ్లేడ్‌ బాబ్జీ అంటూ పవన్‌కు మరో ట్యాగ్‌ తగిలించారు. అట్లుంటది ప్యాకేజీ స్టార్‌తో అంటూ సెటైర్లు వేస్తున్నారు.  అలా పవన్‌ ఇటు జనాల్లో.. అటు జనసేన శ్రేణుల్లో రాజకీయంగా మరి చులకనైపోతున్నాడు.

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)