Breaking News

‘అమేథీలో నా ప్రత్యర్థి ప్రియాంకానే’

Published on Thu, 05/16/2024 - 10:29

లక్నో: లోక్‌సభ ఎ‍న్నికల్లో తన ప్రత్యర్థి కాంగ్రెస్ జనరల్‌ సెక్రటరీ ప్రియాంకా గాంధీ వాద్రా అని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అన్నారు. తనకు చిన్న పిల్లల వలే రాజకీయాలు చేయటం ఇష్టం లేదని తెలిపారు. స్మృతి ఇరానీ మీడియాతో మాట్లాడుతూ..  ప్రియాంకా గాంధీపై విమర్శలు చేశారు.

‘ఈ ఎన్నికల్లో అమేథీలో నా ప్రత్యర్థి.. ప్రియాంకా గాంధీ వాద్రా. నాపై ఆమె తెర వెనక నుంచి పోరాటం చేస్తున్నారు. కనీసం ఆమె సోదరుడు రాహుల్‌ గాంధీ నయం. ఆయన ప్రత్యక్షంగా పోటీలో ఉన్నారు. 2014లో రాహుల్‌ 1.07 లక్షల మెజార్టీతో గెలుపొందారు’ అని ప్రియాంకా గాంధీని ఎద్దేవా చేశారు.

ఇక.. కాంగ్రెస్‌ పార్టీ  అమేథీ పార్లమెంట్‌ స్థానంలో గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన కిషోరి లాల్‌ శర్మను బరిలో నిలిపిన విషయం తెలిసిందే. అదేవిధంగా కాంగ్రెస్‌ కంచుకోట స్థానమైన రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ గాంధీ పోటీ చేస్తున్నారు. ఇప్పటికే రాహుల్‌ గాంధీ కేరళలోని వాయ్‌నాడ్‌లో సైతం పోటీ చేసిన విషయం తెలిసిందే.

ఇక.. అమేథీ, రాయ్‌ బరేలీ స్థానాలు ప్రియాంకా గాంధీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు​. ఈ రెండు స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఆమె కృషి చేస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాలో అన్ని తానై నేతలు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ  ప్రచారంలో దుసూకువెళ్తున్నారు.

అమేథీ, రాయ్‌బరేలీ సెగ్మెంట్లలో ఐదో విడత మే 20న పోలింగ్‌ జరగనుంది. ఇక.. గతంలో రాయ్‌బరేలీలో సోనియా గాంధీ చేతీలో ఓడిపోయిన దినేష్‌ ప్రతాప్‌ సింగ్‌ను మళ్లీ బీజేపీ బరిలోకి దించింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)