Breaking News

‘బీజేపీ 400 సీట్ల నినాదం ఫలించింది! కానీ మనదేశంలో కాదు’

Published on Sat, 07/06/2024 - 08:11

ఢిల్లీ: బ్రిటన్‌ సార్వత్రిక ఎన్నికల్లో  విపక్ష లేబర్‌ పార్టీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. హౌజ్‌ ఆఫ్‌ కామన్స్‌లో 650 స్థానాలకు ఏకంగా 412 సీట్లను ఆ పార్టీ కైవసం చేసుకుంది. దీనిని ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత  శశి థరూర్ బీజేపీపై విమర్శలు చేశారు. 

లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ ఇచ్చిన నినాదం.. మొత్తానికి ఇప్పడు నిజమైందని ఎద్దేవా చేశారు. బీజేపీ ‘అబ్‌ కీ బార్‌, 400 పార్‌’సాధ్యం అయింది.  కానీ, అది  భారత్‌లో కాదు. మరో దేశంలో సాధ్యం అయిందని ‘ఎక్స్‌’ వేదికగా సెటైర్లు వేశారు.

 

‘మొత్తానికి బీజేపీ చేసిన ‘అబ్ కీ బార్‌ 400 పార్’ నినాదం సాధ్యం అయింది. కానీ, అది మరో దేశంలో!’ అని శశీ థరూర్‌ సెటైర్‌ వేశారు. 

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 370 సీట్లు, కూటమిగా 400 సీట్లు గెలుపే లక్ష్యంగా ప్రచారం చేసింది. తాము తప్పకుండా 400  సీట్లు గెలుస్తామని ప్రధాని మోదీతో సహా బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచారంలో ‘అబ్‌ కీ బార్‌ 400 పార్‌’ అనే నినాదాన్ని హోరెత్తించారు. అయితే వారి అంచనాలకు భిన్నంగా బీజేపీ సొంతంగా 240 సీట్లు,  ఎన్డీయే కూటమి 293 స్థానాలకే పరిమితమైంది. మిత్రపక్షాల సాయంతో మరోసారి బీజేపీ అధికారాన్ని చేపట్టింది. ఇక.. కాంగ్రెస్‌ పార్టీ సొంతంగా 99 స్థానాల్లో గెలుపొందగా.. ఇండియా కూటమి 234 సీట్లను కైవసం చేసుకుంది.

ఇక.. బ్రిటన్‌లో తాజాగా అధికారాన్ని చేపట్టిన లేబర్‌ పార్టీ 2019లో 211 సీట్లు గెలవగా.. ఈసారి 412 సీట్లను గెలుచుకొని సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

చదవండి: తమిళనాడు బీఎస్పీ చీఫ్‌ ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్య

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)