Breaking News

భారత్‌ను విమర్శించి తప్పుచేశా: శశిథరూర్‌

Published on Wed, 03/19/2025 - 10:40

తిరువనంతపురం: కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ మరోసారి ఆసక్తికర కామెంట్స్‌ చేసి వార్తల్లో నిలిచారు. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం విషయంలో భారత్‌ సరైన నిర్ణయం తీసుకుందని కితాబు ఇచ్చారు. ఇదే సమయంలో భారత్‌ స్టాండ్‌ను తప్పుగా తీసుకుని విమర్శించినట్టు చెప్పుకొచ్చారు. దీంతో, తప్పులో కాలేసి ఇప్పుడు తన ముఖంపై గుడ్డుతో కొట్టించుకున్నంత పనిచేసినట్టు ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.

కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం (Russia-Ukraine war) మొదలైన సమయంలో భారత్‌ వైఖరిని విమర్శించి నేను ఒక మూర్ఖుడిలా మిగిలిపోయాను. కానీ, భారత ప్రధాని రెండు వారాల వ్యవధిలో ఆ రెండు దేశాల అధినేతలను ఆలింగనం చేసుకొని వారి ఆమోదం పొందారు. చాలా తక్కువ దేశాలకు సాధ్యమయ్యే శాశ్వత శాంతి తీసుకొచ్చే స్థితిలో ప్రస్తుతం భారత్‌ ఉంది. యూరప్‌ వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోకపోవడం వల్ల భారత్ ఎన్నో ప్రయోజనాలు పొందుతోందని అన్నారు.

ఇదే సమయంలో 2003లో భారత్‌.. ఇరాక్‌కు దళాలను పంపాలని అభ్యర్థించినప్పుడు ప్రతిఘటన ఎదురైంది. అమెరికా దాడి తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ భారత శాంతి పరిరక్షక దళాలు ఇరాక్‌కు వెళ్లవని పేర్కొంటూ పార్లమెంటు సమావేశమై ఒక తీర్మానాన్ని ఆమోదించిందని తెలిపారు. కానీ, ఉక్రెయిన్‌ విషయంలో అలా జరగడం నాకు కనిపించలేదన్నారు. శాంతి కోసమే భారత్‌ కచ్చితమైన నిర్ణయాలు తీసుకుందన్నారు. ఇక, ప్రస్తుతానికి తాను ప్రతిపక్షంలో ఉన్నట్టు చెప్పుకొచ్చారు. ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేను అంటూ వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు.. శశిథరూర్‌ వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనవాలా స్పందించారు. తాజాగా పూనావాలా మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్‌పై కాంగ్రెస్ స్వంత వైఖరి తప్పు అని, భారత ప్రభుత్వం చేసిన పనులు పూర్తిగా సరైనవని శశిథరూర్‌ అంగీకరించారు. ఈరోజు మనం రష్యా, పుతిన్, ఉక్రెయిన్‌ జెలెన్‌ స్కీ, అమెరికాతో మంచి సంబంధాలను కలిగి ఉన్నాం. ఇప్పటికైన ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ.. వాస్తవం తెలుసుకోవాలి. భారత విదేశాంగ విధానానికి వ్యతిరేకంగా వ్యవహరించకుండా ఉంటే మంచిది అంటూ కామెంట్స్‌ చేశారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)