Breaking News

వాళ్లని అవినీతికి వాడుకుని వదిలేసిన బాబు

Published on Wed, 03/06/2024 - 05:52

సాక్షి, అమరావతి: టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు దోపిడీలో భాగస్వాములై, అవి­నీతిని కొత్త పుంతలు తొక్కించిన ఆ టీడీపీ నేతలను ఇప్పుడు అదే చంద్రబాబు పాతాళంలోకి తొక్కేస్తున్నారు. చంద్రబాబుకు మాత్రమే సొంతమైన ‘యూజ్‌ అండ్‌ త్రో’ ఆటలో ఆ నేతలకు సొంత నియోజకవర్గాల్లోనే దిక్కు లేకుండాపోయింది. అధికారంలో ఉండగా ఈ నేతలకు సర్వాధికారాలూ ఇచ్చి, అక్రమ సంపాదనకు వారిని ప్రోత్సహించి, రాష్ట్రాన్ని దోచుకున్న చంద్రబాబు.. ఇప్పుడు వారికి టికెట్టు దక్కని పరిస్థితి కల్పించారు. అవసరానికి వాడుకోవడం, అవసరం తీరిపోయాక పక్కన పడేయడం చంద్రబాబుకు మొదటి నుంచి ఉన్న నైపుణ్యం.

సొంత కుటుంబం నుంచి పార్టీలో అనేక మంది నాయకుల వరకు చంద్రబాబు పాలసీకి బలైనవారే. తాజాగా ఆ కోటాలో టీడీపీ సీనియర్‌ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, గంటా శ్రీనివాసరావు, చింతమనేని ప్రభా­కర్, యరపతినేని శ్రీనివాసరావు చేరిపోయారు. 2014–2019 మధ్య యధేచ్ఛగా అవినీతికి పాల్పడి చంద్రబాబుకు, ఆయన తనయుడు లోకేశ్‌కి కప్పం గట్టిన వీరికి ఇప్పుడు సీట్లు లేకుండాపోయాయి. అప్పట్లో అధికారం తలకెక్కడంతో చంద్రబాబు చెప్పినట్లు చేసి తమ కోసం పనిచేసిన సొంత పార్టీ నాయకులు, కార్యకర్తల్నే హింసించారు. తద్వారా కేడర్‌ వ్యతిరేకతను మోయలేనంతగా మూటగట్టుకున్న ఈ నేతలు ప్రజా క్షేత్రంలో బలం కోల్పోవడంతో చంద్రబాబు వెంటనే ప్లేటు ఫిరాయించేశారు. ఈ నేతలను పూచికపుల్లల్లా తీసి పక్కన పడేశారు.

జలవనరులను దోచి ఇచ్చినా ఉమాను పక్కన పెట్టిన బాబుఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు సీటు నిరాకరించడం రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. చంద్రబాబుకు అత్యంత విధేయుడు, సుదీర్ఘకాలం కృష్ణా జిల్లాలో కీలక నేతగా ఉన్నా ఎవరూ ఆయన గురించి ఒక్క మంచి మాట చెప్పరు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక జల వనరుల శాఖ మంత్రిగా ఆయన చేసిన అవినీతి అంతా ఇంతా కాదు. పోలవరం ప్రాజెక్టును దోపిడీకి ఉపయోగించుకున్నారు. ఇతర సాగు నీటి ప్రాజెక్టుల్లోనూ అవినీతిని పారించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోనూ అందిన కాడికి దండుకుని వేల కోట్లు పోగేశారు.

ఆ అక్రమ సంపాదనను చంద్రబాబు, లోకేశ్‌కి కట్టబెట్టి వారి మెప్పు పొందారు. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌ ప్రోద్బలంతో అవినీతి పిచ్చిలో మునిగిపోయిన ఉమ తన కేడర్, నేతలను వదిలేశారు. జిల్లాలో ఇతర నాయకులు, సీనియర్లను కూడా ఇబ్బంది పెట్టారు. జిల్లా పార్టీలో తానే సర్వం అయ్యారు. పని మీద వెళ్లిన పార్టీ నేతలను అవమానించారు. దీంతో నియోజకవర్గం మొత్తం ఆయనకు వ్యతిరేకంగా మారిపోయింది. దీంతో బాబు ఆయన్ని పక్కన పెట్టేశారు. అప్పట్లో తనకు ఎంత సహకరించినా, అవినీతి సొమ్ములో కమీషన్లు కట్టినా చంద్రబాబు కనికరించలేదు.

గంటాతో భూకుంభకోణాలు
­విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీని­వాసరావు అవకాశవాద రాజకీయానికి, అవినీతికి నిలువెత్తు రూపమైనా చంద్రబాబుకు ఆయనకి మంత్రి పదవి కట్టబెట్టారు. గంటా ద్వారా చంద్రబాబు విశాఖలో ఊహించని రీతిలో భూ దందాలు చేయించారు. విశాఖ జిల్లావ్యాప్తంగా నానా బీభత్సం సృష్టించారు.

విశాఖలో భూ కుంభకోణం జరిగిన ప్రతి­చోటా గంటా పేరు వినిపించేది. దీంతో పార్టీలో, జనంలోనూ ఆయనపై వ్యతిరేకత వెల్లువెత్తింది. ఇక గంటాతో ఉపయోగం లేదనుకున్న చంద్రబాబు ఈ­సారి విశాఖలో సీటు లేదని కరాఖండిగా చెప్పారు. ఏకంగా జిల్లా దాటించి విజయనగరం జిల్లా చీపురుపల్లిలో పోటీ చేయాలని సూచించారు. దీంతో గంటా ఏమి చేయాలో పాలుపోక చింతిస్తున్నారు.

అన్ని విధాలుగా వాడుకుని చింతమనేనికే ఎసరు
టీడీపీలోని పాపులర్‌ నాయకుల్లో చింతమనేని ప్రభాకర్‌ ఒకరు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడు. అధికారంలో ఉన్నప్పుడు ఆయన వైపు చూసేందుకే నేతలు, ప్రజలు భయపడేవారు. పోలవరం కాలువ గట్లపై యధేచ్ఛగా మట్టిని తవ్వి అమ్మేసి డబ్బు దండుకున్నారు. తమ్మిలేరులో ఇసుకను అక్రమంగా తవ్వి కనీవినీ ఎరుగని రీతిలో సొమ్ము చేసుకున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన అనధికారిక మంత్రిగా వ్యవహరించారు.

అంతటి అవకాశం ఇచ్చిన చంద్రబాబు,  ఆయన తనయుడికి చింతమనేని క్రమం తప్పకుండా కప్పం కట్టారు. వారి అండ చూసుకుని చింతమనేని అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలను అల్పులుగా చూశారు. ఇసుకను అక్రమంగా తవ్వద్దని అడ్డపడినందుకు మహిళా తహసీల్దార్‌పైనే దాడి చేసిన ఘనుడు. దానికి చంద్రబాబు వంతపాడి తహశీల్దార్‌నే తప్పుపట్టి రాజీ చేశారు. ఇలా అనేక దౌర్జన్యాలకు పాల్పడిన చింతమనేనిపై  40కిపైగా కేసులున్నాయి.

వీటిలో కొన్ని క్రిమినల్‌ కేసులు కూడా ఉన్నాయి. అడ్డగోలుగా గొడవలకు వెళ్లడం, రౌడీయిజంతో భయపెట్టడంతో జనం ఆయన్ని 2019లో ఓడించి కసి తీర్చుకున్నారు. ఇప్పుడు సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఆయనకు సీటిస్తే పని చేసేది లేదని చెప్పడంతో చంద్రబాబూ ఆయన్ని వదిలించుకోవాలనుకున్నారు. దెందులూరు సీటు ఇవ్వనని చెప్పేశారు.యరపతినేనితో గనుల దోపిడీ

ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మైనింగ్‌ డాన్‌గా పేరుపొందారు. లోకేశ్‌ అండతో ఆయన అక్రమ మైనింగ్‌లో రికార్డులు సృష్టించారు. గనులను కొల్లగొట్టి ఆ సొమ్మును లోకేశ్, చంద్రబాబుకు పంచిపెట్టారు. సొంత పార్టీ నేతలే ఆయన అక్రమ మైనింగ్‌ చూసి నివ్వెరపోయారు. అధికారులను కూడా బెదిరించి లొంగదీసుకున్నారనే ఆరోపణలున్నాయి.

గుంటూరు జిల్లాలో తానే హోంశాఖ మంత్రి అనేలా పరిస్థితిని తయారు చేశారు. చంద్రబాబు ఇచ్చిన అధికార బలంతో పోలీసు అధికారులను సొంత ప్రయోజనాలకు వాడుకున్నారు. చివరికి ఆయన పాపం పండి అక్రమాలపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇవన్నీ చూసి పార్టీ కేడరే విసుగెత్తిపోయింది. సొంత నియోజకవర్గంలో ప్రజలు, కేడర్‌ వ్యతిరేకం కావడంతో చంద్రబాబుకు యరపతినేని కరివేపాకు అయ్యారు. ఆయనకు సీటును  డౌటులో పెట్టారు. టికెట్టు ఇస్తారో లేదో తెలియక యరపతినేని గందరగోళంలో ఉన్నారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)