Breaking News

ఐటీ నోటీసులిస్తే మీకది వార్త కాదా?

Published on Wed, 09/06/2023 - 06:00

సాక్షి, అమరావతి: ఎల్లో మీడియాగా గుర్తింపు పొందిన కొన్ని సంస్థలు జర్నలిజంపై గౌరవాన్ని పూర్తిగా దిగజారుస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి (దేవదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ విమర్శించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఐటీ శాఖ నోటీసులిస్తే ఆ పత్రికల్లో కనీసం వార్త కూడా ప్రచురించకపోవటానికి మించి దుర్మార్గం మరొకటి ఉంటుందా? అని ప్రశ్నించారు. ఎల్లో మీడియాలో మీకు నచ్చిందే రాస్తారా? అని నిలదీశారు. మంగళవారం సచివాలయం వద్ద మంత్రి సత్యనారాయణ విలేకరులతో మాట్లాడారు. ‘ఐటీ శాఖ నోటీసులపై చంద్రబాబు నోరు విప్పకపోవటాన్ని బట్టి ఆయన సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటివరకు చాలాసార్లు తప్పించుకున్నారు.

ఆయన అక్రమాల్లో ఐటీ శాఖ గుర్తించింది అవగింజంతే. ‘సీబీఐ, ఈడీ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని తక్షణం అదుపులోకి తీసుకోవాలి. చంద్రబాబు వ్యవస్థలను ఎలా ప్రభావితం చేస్తారో అందరికీ తెలుసు. రాజధానిని అడ్డం పెట్టుకొని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశారు. రూ.ఐదు లక్షలు దాటిన పనులకు టెండర్లు నిర్వహించాల్సి ఉన్నా పోలవరంలో నామినేషన్‌పై రూ.వేల కోట్ల విలువైన పనులను కట్టబెట్టారు. సమాధానం చెప్పకుండా చంద్రబాబు ఎంతో కాలం తప్పించుకోలేరు. సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌లా జైలుకు వెళ్లక తప్పదు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టాననే పవన్‌కళ్యాణ్‌ దీనిపై ఎందుకు స్పందించరు?’ అని మంత్రి సత్య నారాయణ నిలదీశారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)