Breaking News

కేజ్రీవాల్‌ను సునీత కలిస్తే తప్పేంటి?: సంజయ్‌ సింగ్‌

Published on Sat, 04/13/2024 - 13:50

ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో మానీలాండరింగ్‌ అభియోగాల కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఆయన భార్య సునితా కేజ్రీవాల్‌ వ్యక్తిగతంగా సమావేశం కావడానికి అనుమతి ఇవ్వకపోవటంపై  ఆప్‌ నేత సింజయ్‌ సింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం జైలు కిటికీ వద్దనే కలవడాకి అనుమతించటం చాలా అమానవీయమని అన్నారు.

సంజయ్‌ సింగ్‌ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘భయంకరమైన నేరాలకు పాల్పడినవారిని సైతం తమ బ్యారక్‌లలో సమావేశాలు చేసుకోవడానికి అనుమతి ఇస్తారు. మూడుసార్లు సీఎం అయిన అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఆయన భార్య సునితా కేజ్రీవాల్‌ను మాత్రం జైలు రూం గ్లాస్‌ కిటికీ వద్ద కలవమనటం సరికాదు. ఎందుకు ఇంత అమానవీయం?. సునితా కేజ్రీవాల్‌.. సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను వ్యక్తిగతంగా సమావేశం అవుతానని అప్పీల్‌ కూడా చేసుకున్నారు. తీహార్‌ జైలు అధికారులు రూంలో వ్యక్తిగతంగా సమావేశం కావడానికి అనుమతి ఇవ్వలేదు.

కేవలం జైలు రూం కిటికీ వద్ద కలవడానికే మాత్రమే అనుమతి ఇచ్చారు. ఇది సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను అవమానించటమే కాకుండా నైతిక విలువలను ఉల్లంఘించటం’ అని తీహార్‌ జైలు అధికారులపై సంజయ్‌ సింగ్‌ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో అరవింద్‌ కేజ్రీవాల్‌ను కలిసి సమావేశం కావడాన్ని సంజయ్‌ సింగ్‌తో పాటు పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ రద్దు చేసుకున్నారు. ఇక.. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ మనీలాండరింగ్‌ ఆరోపణలపై సంజయ్‌ సింగ్‌ జ్యుడీషియల్‌ కస్టడీ నుంచి ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

Videos

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)