Breaking News

చంద్రబాబుకు అధికారంలో ఉండే హక్కు లేదు: సంజయ్‌ రౌత్‌

Published on Wed, 07/24/2024 - 13:50

ఢిల్లీ: ఏపీ కూటమి అరాచకపాలనకు నిరసనగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన ధర్నాకు శివసేన(యూబీటీ) పార్టీ సంఘీభావం తెలిపింది. బుధవారం మధ్యాహ్నాం వైఎస్‌ జగన్‌ను కలిసిన ఆ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్‌రౌత్‌ తమ పార్టీ మద్దతు ప్రకటించారు. ఏపీ పరిస్థితులకు సంబంధించిన ఫోటో గ్యాలరీని ఆయన సందర్శించారు. అనంతరం సంజయ్‌ రౌత్‌ మీడియాతో మాట్లాడారు. 

‘రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం ఒక్కరోజు కూడా అధికారంలో కొనసాగే హక్కు లేదు.  వైఎస్‌ జగన్‌కు అండగా నిలవడం కోసం నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. మా పార్టీ అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే నాకు ఒకే విషయం చెప్పారు. ప్రభుత్వాలు వస్తుంటాయి. పోతుంటాయి. కానీ, ఈ తరహా ఘటనలు చోటు చేసుకోవడం సరికాదు. ఆంధ్రప్రదేశ్‌లో గత 45 రోజులుగా నరమేధం కొనసాగుతోంది. ఈ రాజకీయ కక్ష సాధింపు ఏదైతే ఉందో.. అది దేశానికే మంచిది కాదు. 

.. దేశంలో కేంద్ర హోం మంత్రి, ఆ మంత్రిత్వ శాఖ ఉంటే.. వెంటనే స్పందించాలి. ప్రత్యేక బృందాన్ని రాష్ట్రానికి పంపాలి. అక్కడ జరుగుతున్న దాడుల, విధ్వంసంపై సమగ్ర విచారణ జరిపించాలి. దాడులకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు చూసిన తర్వాత.. మేము ఒక విషయం స్పష్టం చేయదల్చాము. 

రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం ఒక్కరోజు కూడా అధికారంలో ఉండే హక్కు లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి ప్రజాస్వామ్యం, రాజ్యాంగం లేదు. అందుకే మేము వైఎస్‌ జగన్‌కు, ఆయన పార్టీకి పూర్తి మద్దతు ఇస్తున్నాము. వైఎస్‌ జగన్‌ పోరాటానికి అండగా నిలబడతాం’ అని ఆయన అన్నారు.

చంద్రబాబు ఒక్కక్షణం కూడా అధికారంలో కొనసాగే హక్కులేదు..

కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలి..
శివసేన(యూబీటీ) ఎంపీ, ఆ పార్టీ లోక్‌సభ పక్ష నేత అరవింద్‌ సావంత్‌ వైఎస్సార్‌సీపీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.  ఏపీలో జరిగిన దాడలకు సంబంధించి.. ఫొటో గ్యాలరీ సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో  మాట్లాడారు.  

‘‘ నేను శివసేన లోక్‌సభ పక్ష నేతను. మా ఆత్మకు క్షోభ కలిగించే ఘటనలు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నాయి. మేము గతంలో చంద్రబాబుతో కలిసి, కూటమిలో ఉన్నాము. ఎన్డీఏలో కూడా కొనసాగాం. శివసేన పార్టీలో చీలిక వచ్చినప్పుడు, చాలా మంది పార్టీని వీడారు. కానీ ఉద్ధవ్‌ ఠాక్రే గట్టిగా నిలబడ్డారు. సరిగ్గా వైఎస్‌ జగన్‌ కూడా రాజకీయాల్లో అలా నిలబడ్డారు. అందుకే మేము మా పార్టీలో జగన్‌ గురించి మాట్లాడుకుంటాము. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, అన్నీ తట్టుకుని నిలబడ్డారు. ప్రజల మద్దతుతో సీఎం అయ్యారు.  

నేను ఈరోజు ఇక్కడ కొన్ని చిత్రాలు, వీడియోలు చూశాను. రాజకీయాల్లో గెలుపు, ఓటములు ఉంటాయి. కానీ ఈ తరహాలో ప్రతీకార దాడులు, కక్ష సాధింపు సరికాదు. ఈరోజు నీవు అధికారంలో ఉండొచ్చు. రేపు దాన్ని కోల్పోవచ్చు. కానీ, ఈ విధంగా గెల్చిన తరవాత, ఓడిన పార్టీపై దాడులు చేయడం, ఆ పార్టీ నాయకులను ఎంచుకుని మరీ చంపడం, వారిపై దాడులు చేయడం, వారి ఆస్తులు ధ్వంసం చేయడం.. ఏ మాత్రం సమర్థనీయం కాదు.

ఏపీలో సీఎం కుమారుడు ఏకంగా రెడ్‌ బుక్‌ పట్టుకుని తిరుగుతున్నారు. విపక్షంపై దాడులను ప్రోత్సహిస్తున్నాడు. రాజకీయాల్లో ఈ తరహా చర్యలు ఏ మాత్రం సరికాదు. ఏపీలో జరుగుతోందే.. మహారాష్ట్రలో కూడా కొనసాగుతోంది. ఈడీ దాడులు. సీబీఐ కేసులు. వేధింపులు. నీవు ఈరోజు అధికారంలోకి రావొచ్చు. రాకపోవచ్చు. రాజకీయాల్లో గెలుపు, ఓటమిలు సహజం. దేన్నైనా స్వీకరించాలి. అంతేకానీ, ఈ తరహాలో విపక్షంపై దాడులు, వేధింపులు సరికాదు. అందుకే వైఎస్‌ జగన్‌, ఆయన పార్టీకి అండగా నిలవడానికి, మద్దతు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాను. 

.. మా ముంబైలో తెలుగు ప్రజలు చాలా మంది ఉన్నారు. నేను కేంద్ర ప్రభుత్వానికి ఒక విషయం స్పష్టం చేస్తున్నాను. ఏపీలో ఇంత జరుగుతున్నా, మీరు ఇలాగే కళ్లు మూసుకుని కూర్చుంటే, అది మరో మణిపూర్‌ అవుతుంది. ఇది ఏ మాత్రం సరికాదు. కాబట్టి, వెంటనే జోక్యం చేసుకొండి. ఆంధ్రప్రదేశ్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూడండి. ఈ పోరాటంలో మేము వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి పూర్తి అండగా నిలుస్తా​. పార్లమెంటులో కూడా వారితో కలిసి పని చేస్తాం’ అని అన్నారు.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)