Breaking News

దాడుల కోసం.. అమిత్‌ షా సుపారీ తీసుకున్నారు: సంజయ్‌ రౌత్‌

Published on Sun, 08/11/2024 - 20:36

ముంబై: ఇతర పార్టీ చీఫ్‌ల కాన్వాయ్‌లే లక్ష్యంగా బీజేపీ, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్‌) పార్టీల కార్యకర్తలు దాడులు చేయటాన్ని ఇలాగే కొనసాగిస్తే.. తాము కూడా భవిష్యత్తులో ప్రతీకారం తీర్చుకుంటామని శివసేన(యూబీటీ) నేత సంజయ్‌ రౌత్‌ వార్నింగ్‌ ఇచ్చారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. థానేలో శనివారం శివసేన(యూబీటీ) చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే కాన్వాపై ఎంఎన్‌ఎస్‌ కార్యాకర్తలు దాడి చేశారు. ఈ ఘటనపై ఆదివారం సంజయ్‌ రౌత్‌ మాట్లాడారు. అహ్మద్ షా అబ్దాలీ (హోంశాఖ మంత్రి అమిత్‌ షాను పరోక్షంగా ఉద్దేశిస్తూ..)కు మహారాష్ట్రంలో దాడుల ద్వారా అరాచకం వ్యాప్తి చేయాలని ఢిల్లీలో ఉండే కేంద్ర పాలకులు సుపారీ ఇచ్చారని మండిపడ్డారు. 

‘ఉద్దవ్‌ ఠాక్రే కాన్వాయ్‌పై శనివారం రాత్రి దాడి జరిగింది. ఇలాంటి చేయాలనే వాళ్లు ఉన్నారు. అమిత్‌ షా ఇలాంటి దాడులు చేయించడానికి ఢిల్లీ నుంచి సుపారీ అందుకున్నారు. ఎన్‌ఎన్‌ఎస్‌ కార్యకర్తలను ఇటువంటి పనులు చేయించుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు. కానీ సదరు నేతలు మాత్రం ఢిల్లీ నుంచి సుపారీ తీసుకొని సైలెంట్‌గా ఉంటున్నారు. ఇలా దాడులకు తెగపడటం మహారాష్ట్రకు మంచిది కాదు. నేను ఏ పార్టీ పేరును ప్రస్తావించటం లేదు. కానీ, కొన్ని పార్టీలు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఇప్పటి నుంచే కుట్రలు పన్నుతున్నారు’ అని మండిపడ్డారు.

 

 

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)