Breaking News

‘రాజదండం స్థానంలో రాజ్యాంగ ప్రతిని అమర్చండి’

Published on Thu, 06/27/2024 - 14:01

ఢిల్లీ: 18వ పార్లమెంట్‌ సమావేశాల్లో భాగంగా గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఉదయం రాష్ట్రపతిని ‘రాజ దండం’తో ఉపరాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్‌, ప్రధని మోదీ పార్లమెంట్‌లోకి స్వాగతం పలికారు. అయితే లోక్‌సభలో రాజ దండాన్ని స్పీకర్‌ చైర్‌ పక్కన గోడకు అమర్చటంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. రాజదండానికి ఉన్న ప్రముఖ్యత  ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో రాజదండం స్థానంలో రాజ్యాంగ  ప్రతిని అమర్చాలని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆర్‌కే చౌదరీ లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు లేఖ రాశారు.

‘దేశంలో ప్రజాస్వామ్యంలో కోసం  రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నాం. ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం ఒక చిహ్నం.బీజేపీ  గత ప్రభుత్వంలో రాజదండాన్ని స్పీకర్‌ చైర్‌కు పక్కన గోడకు అమర్చారు. సెంగోల్ అనే తమిళ పదం నుంచి వచ్చింది. సెంగోల్‌ అర్థం దండం. రాజదండం అంటే రాజు చేతి కర్ర. 

మనం రాజరిక పాలన నుంచి ఎప్పుడో విముక్తులం అయ్యాము. ప్రస్తుతం ఓటు అర్హత కలిగి ఉన్న స్త్రీ,పరుషులు ఓటువేసి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నారు. దేశంలో పాలన రాజ్యాంగంతో నడవాలా? లేదా రాజదండంతో నడవాలా?. రాజదండం స్థానంలో రాజ్యాంగాన్ని అమర్చి.. రాజ్యాంగాన్ని రక్షించండి’ అని ఆయన స్పీకర్‌కు రాసిన లేఖలో ప్రస్తావించారు.

సెంగోల్‌పై విపక్షాలు చేస్తున్న విమర్శలకు బీజేపీ కౌంటర్‌ ఇచ్చింది. ‘సమాజ్‌వాదీ పార్టీ గతంలో రామచరిత్‌మానస్‌పై విమర్శలు గుప్పించింది. ఇప్పుడు భారతీయ సంస్కృతిలో, ముఖ్యంగా తమిళ సంస్కృతిలో భాగమైన సెంగోల్‌పై విమర్శలు చేస్తోంది. సమాజ్‌వాదీ పార్టీ సెంగోల్‌ను అవమానించడాన్ని  డీఎంకే పార్టీ సమర్థిస్తుందో? లేదో? స్పష్టం చేయాలి’ అని విపక్షాల విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)