Breaking News

హిందూపురంలో టీడీపీ దుర్మార్గానికి దిగింది: సాకే శైలజానాథ్

Published on Sat, 11/15/2025 - 19:02

సాక్షి, తాడేపల్లి: హిందూపురం వైఎస్సార్‌సీపీ ఆఫీసుపై దాడిని ఆ పార్టీ నేత, మాజీ మం‍త్రి సాకే శైలజానాథ్‌ ఖండించారు. బాలకృష్ణ హిందూపురానికి ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్తున్నారని ఆరోపిస్తే దాడి చేస్తారా? అంటూ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరని టీటీడీ గూండాలు రెచ్చి పోతున్నారు. ప్రశ్నించే వారిపై దాడి చేస్తే ఎవరూ భయపడరు. అధికారం శాశ్వతం కాదని చంద్రబాబు గుర్తించాలి. ఈ దాడులు చూస్తుంటే నాగరిక సమాజంలో ఉన్నామా? అనిపిస్తోంది’’ అని శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సతీష్ మృతి వెనుక వాస్తవాలను బయట పెట్టాలి
సతీష్ కుమార్ మృతిపై సీబిఐ, సుప్రీంకోర్టు జడ్జీతో విచారణ జరపాలని సాకే శైలజానాథ్‌ డిమాండ్‌ చేశారు. సతీష్ మృతి వెనుక ఏం జరిగిందో వాస్తవాలను బయట పెట్టాలన్నారు. ఈలోపే సతీష్‌ది హత్యే అని టీటీడీ నేతలు మాట్లాడుతున్నారు. ఒక కేసు విచారణలో ఉన్నప్పుడు ఇష్టానుసారం ఎలా మాట్లాడతారు?. పోస్టుమార్టం కూడా కాకముందే హత్య అని ఎలా చెబుతారు?. పోలీసుల విచారణ సజావుగా జరపాలి. సున్నితమైన కేసు కాబట్టి సీబిఐతోనో, సుప్రీంకోర్టు జడ్జితోనో విచారణ జరపాలి’’ అని శైలజానాథ్‌ పేర్కొన్నారు.

పరకామణిలో చోరీని గుర్తించి.. ఫిర్యాదు చేసిన సతీష్‌నే అనేకసార్లు విచారణ పేరుతో పిలవటం ఏంటి?. రాష్ట్రంలో పోలీసుల మీద పోలీసులే విచారణ జరపటం దారుణం. చెవిరెడ్డి గన్‌మెన్‌ని కూడా విచారణ పేరుతో వేధించారు. ఇప్పటికీ పదిమంది పైనే పోలీసు ఆఫీసర్లకు పోస్టింగులు కూడా ఇవ్వకుండా వేధిస్తున్నారు. తాము చెప్పిన పనులు చేయకపోతే వీఆర్‌కు పంపుతున్నారు. పోలీసులను కూడా అనుకూలురు, వ్యతిరేకులు అంటూ విభజించటం సరికాదు.

..ప్రజా వ్యతిరేకతను డైవర్షన్ చేసేందుకే కొత్తకొత్త కథలు అల్లుతున్నారు. సతీష్ కుమార్ ఎలా చనిపోయాడనే వాస్తవం ప్రజలకు తెలియాలి. సతీష్ భార్య ఫోన్‌ని ఎందుకు తీసుకున్నారు?. వారి కుటుంబ సభ్యులను తమ కంట్రోల్ ఎందుకు పెట్టుకున్నారు?. వీటన్నిటిపై ప్రజలకు అనేక అనుమానాలు కలుగుతున్నాయి. విచారణ నిష్పక్షపాతంగా జరగాలి’’ అని శైలజానాథ్‌ డిమాండ్‌ చేశారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)