ఈ అవకాశాన్ని ఛాలెంజ్‌గా తీసుకోండి: సజ్జల

Published on Sun, 08/24/2025 - 17:08

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ పునాదులను బలంగా నిర్మించడంలో క్రియాశీలక పాత్ర పోషించాలని.. ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శులతో అవగాహనా సమావేశం ఆదివారం జరిగింది.

ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు లేళ్ళ అప్పిరెడ్డి, పూడి శ్రీహరి, వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్‌ సుధాకర్‌ బాబు, లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు ఎం.మనోహర్‌ రెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులంటే జిల్లాలో పార్టీకి కమాండర్‌ లాంటి వారన్నారు. పార్టీ ఇచ్చిన అవకాశాన్ని ఛాలెంజ్‌గా తీసుకుని నిలబడాలి.. వైఎస్సార్‌సీపీది ప్రజాపక్షం అని ప్రజల్లోకి తీసుకెళ్లాలి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

‘‘మనమంతా బలమైన వ్యవస్ధగా రూపొందాం. మీరంతా మీ శక్తి సామర్ధ్యాలు నిరూపించుకునే అవకాశం మీకు పార్టీలో కల్పించబడింది. దానిని ఛాలెంజ్‌గా తీసుకుని మీరు నిలబడాలి. మండల స్ధాయి నుంచి బలమైన నాయకత్వం ఉన్నప్పుడే మనం అనుకున్న ఫలితాలు సాధించగలుగుతాం. ప్రజా సమస్యలపై నిరంతరం ప్రజలపక్షాన నిలబడాలి. ప్రభుత్వాన్ని నిలదీయడం, ప్రజల గొంతుకగా మనం నిలబడాలి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి దిశానిర్దేశం చేశారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)