Breaking News

చంద్రబాబు డైరెక్షన్‌లోనే పట్టాభి అనుచిత వ్యాఖ్యలు: సజ్జల

Published on Fri, 10/22/2021 - 15:18

సాక్షి, గుంటూరు: చంద్రబాబుకు రాజకీయ సంస్కారం లేదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ.. 'ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుది. బాబు లాంటి ద్రోహి ఉండటానికి వీల్లేదని ఎన్టీఆర్‌ ఆనాడే అన్నారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలను చంద్రబాబు మరింత దిగజార్చారు. కావాలనే సీఎంపై అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారు.

అధికారం లేకపోయేసరికి చంద్రబాబుకు మతిభ్రమించింది. రాష్ట్రంలో గొడవలు సృష్టించాలని చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారు. ఎల్లో మీడియాతో కలిసి చంద్రబాబు అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారు. యువకుడైన సీఎం బాధ్యతగా వ్యవహరిస్తుంటే.. 70 ఏళ్ల వ్యక్తి బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబును ప్రజలు అసహ్యించుకుంటున్నారు. టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని ఈసీని కోరుతాం. పాప విముక్తి కావాలంటే ఇప్పటికైనా చంద్రబాబు క్షమాపణ కోరాలి' అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. 

చదవండి: (టీడీపీపై సీఈసీకి ఫిర్యాదు చేస్తాం)

Videos

స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం క్లీన్ స్వీప్ చేశాం

Covid-19 New Variant: తొందరగా సోకుతుంది..

మీరు కూడా పుస్తకాలు తీసి పేర్లు రెడీ చేయేండి..

YSRCP హయాంలో ఈ తరహా రాజకీయాలు చేయలేదు: YS Jagan

పెళ్ళైన రెండో రోజే మృత్యుఒడికి నవవరుడు

LIVE: మనకూ టైం వస్తుంది.. వాళ్లకు సినిమా చూపిస్తాం

MISS INDIA: తిరుమల శ్రీవారి సేవలో మానస వారణాసి

బెంగళూరులో రోడ్లు, కాలనీలు జలమయం

రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ కార్పొరేటర్లతో సమావేశం

హీరోయిన్ సాయి ధన్సిక తో విశాల్ వివాహం

Photos

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)

+5

డిగ్రీ తీసుకున్న కుమారుడు - ఆనందంలో కల్వకుంట్ల కవిత (ఫోటోలు)

+5

'వార్‌ 2' మొదలైంది.. టీజర్‌లో ఈ షాట్స్‌ గమనించారా? (ఫోటోలు)

+5

ఐదో రోజు సరస్వతీ నది పుష్కరాలు..భక్తజన సంద్రం (ఫోటోలు)

+5

విశాల్‌తో పెళ్లి.. నటి ధన్సిక ఎవరో తెలుసా (ఫోటోలు)

+5

ముంచెత్తిన కుండపోత.. నీట మునిగిన బెంగళూరు (ఫొటోలు)

+5

జూ.ఎన్టీఆర్ బర్త్ డే.. ఈ విషయాలు తెలుసా? (ఫొటోలు)

+5

పెళ్లయి మూడేళ్లు.. నిక్కీ-ఆది హ్యాపీ మూమెంట్స్ (ఫొటోలు)

+5

ఏలూరులో ఘనంగా ‘భైరవం’ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)