‘చంద్రబాబు దుర్మార్గపు పాలనపై పోరాటం చేయాలి’

Published on Sat, 06/06/2026 - 17:48

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మైనారిటీ సదస్సు నిర్వహించారు. మైనారిటీల సమస్యలు, పార్టీ బలోపేతం సహా పలు అంశాలపై చర్చించారు. పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మైనారిటీ నేతలు ఖాదర్ భాషా, హసీఫ్ ఖాన్, ఎమ్మెల్సీలు రుహుల్లా, నిస్సార్ భాషా, నూరీ పాథిమా సహా పలువురు మైనారిటీ ప్రతినిధులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు దుర్మార్గపు పాలన, అరాచకాలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ‘‘వైఎస్ జగన్ అన్ని వర్గాలకూ న్యాయం చేస్తే.. చంద్రబాబు అందరినీ మోసం చేశారని.. వివిధ రాజకీయ శక్తులు ఏకమై అబద్ధాల ప్రచారంతో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఈ రెండేళ్ల పాలనలో ప్రజలను పూర్తిగా వంచించారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా గాలిలో కలిపేశారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి వ్యక్తిగత విమర్శలు, రాజకీయ దూషణలకే పరిమితమయ్యారు’’ అంటూ సజ్జల దుయ్యబట్టారు.

‘‘చివరికి మోసపోయిన డీఎస్సీ అభ్యర్థులపై కూడా విమర్శలు చేయటం దుర్మార్గం. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో లక్షలాది ఉద్యోగాలను ఎలాంటి వివాదాలకు తావులేకుండా భర్తీ చేశాం. కానీ చంద్రబాబు పదహారు వేల ఉద్యోగాలకు కూడా సరిగా పరీక్షలు నిర్వహించలేకపోయారు. మైనారిటీలకు వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ అండగా నిలుస్తుంది. ఎస్‌ఐఆర్ ప్రక్రియపై పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి

మైనార్టీలను రాజకీయంగా ప్రోత్సహించింది YSRCP

..వైఎస్సార్సీపీ అనుకూల ఓట్లను తొలగించే ప్రయత్నాలను అడ్డుకోవాలి. జూన్ 15 నుంచి ప్రారంభమయ్యే ఇంటింటి సర్వేపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి పార్టీ బలాన్ని చాటాలి. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు భవిష్యత్తులో తగిన గుర్తింపు ఉంటుంది’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

Videos

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)