Breaking News

‘కొమ్మినేని అరెస్ట్‌కు 200 టీడీపీ అనుకూల యూట్యూబ్‌ ఛానెళ్ల కుట్ర’

Published on Mon, 06/09/2025 - 14:06

సాక్షి,తాడేపల్లి: ప్రముఖ జర్నలిస్ట్‌ కొమ్మినేని శ్రీనివాసరావును కూటమి ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్‌ చేసింది. ఆ అరెస్ట్‌ను వైఎస్సార్‌సీపీ  స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి  ఖండించారు. ఈ సందర్భంగా ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

ఆర్గనైజ్డ్‌గా టీడీపీ ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తున్నాయి. మూడు రోజులుగా టీడీపీ ఎల్లో మీడియా చేస్తున్న రాద్దాంతం దారుణం. విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తిగతమైనవి, కృష్ణం రాజు మాటలను కొమ్మినేని శ్రీనివాసరావు ఆపేశారు. అసలు విషయాలు పక్కకు పోతాయని, అనసవర విషయాలు పట్టించుకునే వాళ్లం కాదు. దుర్మార్గులు, పిరికివాళ్లు అనవసర విషయాల మీద రాద్ధాంతం చేస్తారు. లేని విషయాన్ని క్రియేట్‌ చేసి విష ప్రచారం చేయడమే టీడీపీ పని. వాళ్లు ట్వీట్‌ పెట్టడంతో వారు ఆర్గనైజ్డ్‌గా చేస్తున్నారనే అనుమానం వచ్చింది.కృత్రిమంగా ఆర్గనైజ్డ్‌ చేసిన నిరసనలే. 

ఈనెల 6వ తేదీ ఉదయం సాక్షి టీవీలో కొమ్మినేని షోలో కృష్ణంరాజు పాల్గొన్నారు. ఆ షోలో ఓ అంశం పై కృష్ణం రాజు వ్యాఖ్యలు. 24 గంటల తర్వాత పథకం ప్రకారం రాద్ధాంతం చేస్తున్నారు. టీడీపీ, ఆ పార్టీ ప్రచార సంస్థలు, 200 యూట్యూబ్ ఛానల్స్ మూడు రోజుల నుంచి ఇదే పనిలో ఉన్నాయి. కొద్ది సేపటి క్రితం కొమ్మినేని శ్రీనివాసరావును అక్రమంగా అరెస్ట్ చేశారు. ఇదంతా చేస్తోంది అధికార పార్టీనే.

6వ తేదీన జరిగిన డిబేట్ లో అమరావతి చుట్టుపక్కల గురించి ప్రస్తావన వచ్చినపుడు కొమ్మినేని వారించారు. కొమ్మినేని వారించారు...డిబేట్ కూడా అయిపోయింది. ఆ డిబేట్ తర్వాత మరోసారి ప్రసారం కాలేదు. కొమ్మినేని కానీ, కృష్ణంరాజు కానీ మళ్లీ ఎక్కడా ప్రస్తావించలేదు. 7వ తేదీ నుంచి దుష్ప్రచారం మొదలు పెట్టారు. ఏబీఎన్‌, టీవీ5లు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కించపరిచేలా వందల డిబేట్లు నిర్వహించారు. కానీ మేం ఏనాడూ పట్టించుకోలేదు. కేవలం దూర్భషలాడేవాళ్లు...సత్తా లేనివాళ్లు మాత్రమే ఇలా చేస్తారు.

వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ ఇలాంటి దూర్భషలాడేలా వ్యవహరించలేదు. లేని సమస్యను సృష్టించి విషప్రచారం చేయడం టీడీపీకి, చంద్రబాబుకు అలవాటు. నారా లోకేష్ ట్వీట్ పెట్టిన తర్వాత మాకు అనుమానం వచ్చింది.  సాక్షి మీడియా కూడా కృష్ణంరాజు వ్యాఖ్యలను ఖండించింది.
ఇలాంటివి తామెప్పుడూ ప్రోత్సహించమని సాక్షి స్పష్టం చేసింది. వైఎస్సార్‌సీపీ కూడా ఖండన విడుదల చేసింది.

8వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు, దుర్భాషలు, సాక్షి ఆఫీస్‌పై దాడులతో పరాకాష్టకు చేరింది. తన షోలో జరిగిన అంశం కాబట్టి కొమ్మినేని కూడా క్షమాపణ చెప్పారు. టీడీపీ వాళ్లు ఆర్గనైజ్ చేసి తప్పుడు కేసులు పెట్టి వేధించడానికే ఈ అంశాన్ని వాడుకుంటున్నారు. అంచెలంచెలుగా ఈ అంశాన్ని లైవ్ లో ఉంచాలని చూస్తున్నారు. అమరావతిని పొరబాటున ఎవరైనా ఏదైనా అంటే రాష్ట్రమంతా కదిలొస్తుందని చూపేందుకు ఆర్గనైజ్ గా కార్యక్రమాలు చేపట్టారు.

చంద్రబాబు ట్వీట్‌తో సహా టీడీపీ అధికారిక మీడియాలో మూడు రోజుల నుంచి అమరావతి మహిళల పరువు తీస్తున్నారు. అదే పనిగా మహిళల పరువును తీసేలా వ్యవహరించినది ఎవరు? రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నారంటే రాష్ట్రం మొత్తాన్నీ అవమానించినట్లేనా. చంద్రబాబు ఒక పథకం ప్రకారం తనకు తెలిసిన ఏకైక విద్యను ప్రదర్శిస్తున్నాడు. కొమ్మినేని సుదీర్ఘకాలం జర్నలిజంలో పొరబాటున కూడా ఒకరిని ఒక మాట అనలేదు. ఎన్టీవీలో నిస్పక్షపాతంగా డిబేట్లు చేసినందుకు ఉద్యోగంలోంచి తీయించాడు. ఉద్యోగం తీసేవరకూ ఎన్టీవీ ప్రసారాలను చంద్రబాబు నిలిపివేయించాడు. ఆతర్వాత కొమ్మినేని సాక్షి టీవీలో చేరారు.

ఈ ప్రభుత్వానికి పోయే కాలం వచ్చింది కాబట్టే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఏడాది కాలంలోనే ఈ ప్రభుత్వం పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. రోజూ మహిళల పై జరుగుతున్న అఘాయిత్యాలు ...పోలీసుల దుర్మార్గాలు ఎవరికీ కనబడటం లేదు వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి హయాంలో మహిళల పట్ల ఏదైనా ఘటన జరిగితే స్పందించిన తీరు జాతీయ స్థాయిలో ప్రశంసలందుకుంది. అనంతపురంలో 14 ఏళ్ల బాలికను చంపేస్తే ఈ ప్రభుత్వానికి కనిపించదు. కంప్లెంట్ ఇచ్చిన రోజే పోలీసులు స్పందించి ఉంటే బాలిక ప్రాణాలతో ఉండేది. వైఎస్‌ జగన్‌ మహిళలకు పెద్దపీట వేశారు. మహిళలను ఇంటికి కేంద్రబిందువుగా గుర్తించిన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి. అలాంటి జగన్ మోహన్ రెడ్డి మహిళలను కించపరుస్తారా. ఈ ప్రభుత్వ తీరును ప్రజలంతా గమనించాలి. అరెస్టులు చేయడానికేనా మీకు అధికారం ఇచ్చింది

ఓ సీనియర్ జర్నలిస్టును ఈ విధంగా అరెస్ట్ చేయడం.. మొత్తం మీడియాకే ప్రమాద ఘంటికలు. చంద్రబాబును పొగిడితేనే మీడియాకు మనుగడ ఉంటుందనేలా హెచ్చరిస్తున్నారు. ఓ జర్నలిస్టు డిబేట్ పెడితేనే చంద్రబాబు భయపడుతున్నారు’అని వ్యాఖ్యానించారు. 

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)