Breaking News

సీఎం జగన్ మాటల్లో కాదు.. చేతల్లో చూపిస్తున్నారు: సజ్జల

Published on Thu, 03/09/2023 - 14:50

సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో సామాజిక న్యాయం జరుగుతుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గురువారం నామినేషన్లు దాఖలు చేశారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులుగా పెనుమత్స సురేష్‌, కోలా గురువులు, ఇజ్రాయిల్‌, మర్రి రాజశేఖర్‌, జయమంగళ వెంకట రమణ, పోతుల సునీత, చంద్రగిరి యేసురత్నం నామినేషన్లు వేశారు.

ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ, గత ప్రభుత్వం మాటలకే పరిమితమైందన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు ఎందుకు ఇన్ని అవకాశాలు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. ‘‘సీఎం జగన్‌ సామాజిక సాధికారతను చేతల్లో చూపుతున్నారు.. మూడున్నరేళ్లలో సీఎం జగన్ సామాజిక విప్లవం తీసుకొచ్చారు’’ అని సజ్జల అన్నారు.

‘‘18 ఎమ్మెల్సీ స్థానాల్లో 14 స్థానాలు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించాం. అందులో 11 స్థానాలు బీసీలకు కేటాయించడం చరిత్రాత్మకం. రాజకీయ సాధికారత దిశగా సీఎం జగన్‌ ముందుకు వెళ్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం జగన్‌ పెద్దపీట వేస్తున్నారు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
చదవండి: నామినేషన్‌ దాఖలు చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థులు

Videos

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)