Breaking News

బాబు ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత సుస్పష్టం: సజ్జల

Published on Wed, 06/04/2025 - 14:29

సాక్షి, గుంటూరు: చంద్రబాబు ప్రభుత్వంపై తొలి ఏడాదిలోనే ప్రజా వ్యతిరేకత వచ్చిందని, ఇవాళ అది స్పష్టంగా కనిపించిందని  వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Rama Krishna Reddy) అన్నారు. వైఎస్సార్‌సీపీ ఇవాళ(బుధవారం, జూన్‌ 4) చేపట్టిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాలు విజయవంతమైనట్లు మీడియా ముఖంగా ప్రకటించారాయన. 

ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏడాది గడిచినా అమలు కాలేదు. ఏడాది కాలంలోనే ప్రజా వ్యతిరేకత వచ్చింది. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. వైఎస్సార్‌సీపీ ఇవాళ చేపట్టిన నిరసన కార్యక్రమం విజయవంతమైంది. వైఎస్సార్‌సీపీ కష్టాల నుంచే పుట్టింది. మా హయాంలో 15 ఏళ్లలో జరగాల్సిన అభివృద్ధి.. మూడేళ్లలోనే జరిగింది. 

అధికారంలోకి రాగానే మేం తొలి ఏడాదిలోనే 99 శాతం హామీలు అమలు చేశాం. కోవిడ్‌ రెండేళ్లలోనూ సంక్షేమ పథకాలు అమలు చేశాం.  మిగిలిన మూడేళ్లలోనే 10, 15 ఏళ్ల అభివృద్ధి చూపించాం. విద్య, వైద్య, వ్యవసాయం రంగాలకు ప్రాధాన్యం ఇచ్చాం. కానీ.. 

చంద్రబాబు పాలనలో వ్యవస్థలు అన్నీ సర్వనాశనం అయ్యాయి. తొలి ఏడాదిలోనే రికార్డ్‌ స్థాయిలో(రూ.లక్షా 50వేల కోట్లకు పైగా) చంద్రబాబు అప్పులు చేశారు. ఆ అప్పు ఏం చేశారో తెలియదు. ఏడాదిలోనే రైతులను సంక్షోభంలోకి నెట్టేశారు. పంటలకు కనీస మద్ధతు ధరలు లేవు. ఇప్పటికే 4 లక్షల పెన్షన్లు కట్‌ చేశారు. వైఎస్‌ జగన్‌ తెచ్చిన సంక్షేమ పథకాలను సైతం ఎత్తేశారు. చంద్రబాబు తీరుపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది’’ అని సజ్జల అన్నారు.

	Sajjala Ramakrishna: బాబు ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత సుస్పష్టం

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)