Breaking News

రాహుల్‌ ధైర్యవంతుడు, నిజాయితీ కలిగిన నేత: సైఫ్‌ ప్రశంసలు

Published on Fri, 09/27/2024 - 16:18

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీపై బాలీవుడ్‌ స్టార్‌ నటుడు సైఫ్ అలీ ఖాన్‌ ప్రశంసలు కురిపించారు. విమర్శలను ఎలా ఎదుర్కొవాలో తెలిసిన ధైర్యవంతమైన రాజకీయ నాయకుడని కొనియాడారు. అలాంటి ధైర్యవంతులైన, నిజాయితీ కలిగిన నేతలంటే తనకు ఇష్టమని పేర్కొన్నారు. ఈ మేరకు ఓ జాతీయ మీడియా నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న సైఫ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, ఆప్‌ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌.. వీరిలో ఎవరూ ధైర్యవంతులని, ఎవరు భవిష్యత్తులో దేశాన్ని ముందుకు తీసుకెళ్లగలరని మీరు భావిస్తున్నట్లు అడగ్గా.. ముగ్గురూ ధైర్యవంతులైన రాజకీయ నాయకులేనని అన్నారు. అయితే గతంలో రాహుల్‌పై వచ్చిన విమర్శలను ఆయన ఎంతో ధీటుగా ఎదుర్కొన్నారని తెలిపారు.
చదవండి: మోదీని కాదు నన్ను ప్రధానిని చేస్తామన్నారు.. నితిన్‌ గడ్కరీ

‘రాహుల్‌గాంధీ తీరు నన్ను ఎక్కువగా ఆకట్టుకుంటోంది. గతంలో ఆయన చేసే పనులను, చెప్పే మాటలను కొంతమంది అగౌరవపర్చిన సందర్భాలున్నాయి. అలాంటి స్థితి నుంచి ఆయన తనను తాను ఎంతగానో మార్చుకున్నారు. చాలా కష్టపడి తన పనుల ద్వారా విమర్శలను తిప్పికొట్టాడు. మళ్లీ ప్రజల్లో ఆదరణ చూరగొన్నారు. ఆ ప్రయాణం చాలా ఆసక్తిగా అనిపిస్తోంది’ అని సైఫ్‌ చెప్పారు. దీనికి  సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

తాను రాజకీయ నాయకుడిని కాదని, భవిష్యత్తులోనూరాజకీయాల్లో చేరాలనుకోవడం లేదని పైఫ్‌ తెలిపారు. అలాగే ఎవరికి మద్దతిస్తానన్న నిర్దిష్ట ప్రశ్నకు సమాధానం చెప్పలేననని పేర్కొన్నారు.అయితే తనకు ఏదైనా విషయంలో బలమైన అభిప్రాయాలు ఉంటే కచ్చితంగా వాటిని అందరితో పంచుకుంటానని చెప్పారు. అలాగే భారతదేశంలో ప్రజాస్వామ్యం సజీవంగా ఉందని, అది ఇంకా అభివృద్ధి చెందుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు

Videos

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)