Breaking News

ట్యాపింగ్‌ నేరమేం కాదు.. ఆ మాట రేవంతే అన్నారు

Published on Fri, 01/23/2026 - 13:26

సాక్షి, హైదరాబాద్‌: కేటీఆర్‌ విచారణ వేళ.. మాజీ ఐపీఎస్‌ అధికారి, బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్‌ట్యాపింగ్‌ అనేది నేరమేం కాదని.. అది పోలీసుల అంతర్గత వ్యవహారమని అన్నారాయన. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 

ఫోన్‌ ట్యాపింగ్‌ నేరం కాదు. ఇది పోలీసుల అంతర్గత వ్యవహారం. ఈ విషయాన్ని సీఎం రేవంత్‌ రెడ్డే ఒప్పుకున్నారు. కానీ, కావాలనే ఈ విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ కలిసి నాటకాలు ఆడుతున్నాయి. అవినీతిని ప్రశ్నిస్తున్నామనే కేసులు పెడుతున్నారు. హామీలపై నిలదీస్తామనే అటెన్షన్‌ డైవర్షన్‌చేస్తున్నారు. రేవంత్‌ సర్కార్‌ ప్రజలను దోచుకుంటోంది. తెలంగాణ సంపదను ఇతర రాష్ట్రాలకు తరలిస్తోంది. ప్రజల కోసమే కేటీఆర్‌, హరీష్‌ పోరాడుతున్నారు. ఈ-కార్‌ రేసు అంటూ విచారణ జరిపారు. మరి విచారణలో ఏం తేల్చారు?.. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదు. 

అదొక చెల్లని సిట్‌
ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో పంజాగుట్టలో వేసిన సిట్‌ చట్ట వ్యతిరేకం. సంబంధం లేకున్నా హరీష్‌రావు, కేటీఆర్‌లకు నోటీసులు ఇచ్చారు. విచారణలో ఏ ఒక్కరూ వీళ్ల పేర్లు చెప్పలేదు. అందుకే సజ్జనార్‌తో మరొక సిట్‌ వేశారు. ఈ సిట్‌కు బాధ్యత వహించే అర్హత సజ్జనార్‌కు లేదు. రాజకీయ నేతలను వేధించే సిట్‌కు చీఫ్‌గా సజ్జనార్‌ ఉన్నారు. సజ్జనార్‌పై విచారణ జరగాలి. అసలు ఏ అర్హతతో ఆయన విచారణ జరుపుతున్నారు. సజ్జనార్‌పై ఏడు కేసులు ఉన్నాయి. అన్ని కేసులున్న వ్యక్తిని ఎలా నియమిస్తారు?. ముందు అసలు సజ్జనార్‌పై విచారణ జరగాలి.  

నిజంగా సిట్‌ వేయాలనుకుంటే.. చెక్‌ డ్యామ్‌లు పేల్చిన ఘటనపై వేయాలి. హిల్ట్‌ స్కామ్‌పై వేయాలి. కానీ, ప్రత్యర్థులను వేధించేందుకే సిట్‌ వేశారు. దేశ రక్షణపై రేవంత్‌రెడ్డికి ఏమైనా బాధ్యత ఉందా?. రేవంత్‌ రాజకీయ క్రీడలో భాగమైనవాళ్లను వదిలేదు. రేపు బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే అలాంటి అధికారులపై చర్యలుంటాయ్‌. 

RS Praveen : ఫోన్ ట్యాపింగ్ కేసులో రేవంత్ రెడ్డిని విచారించాలి

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)