Breaking News

రాహుల్‌ గాంధీ కుట్టిన చెప్పులకు రూ. 10 లక్షల ఆఫర్‌..

Published on Fri, 08/02/2024 - 10:59

కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో పక్షనేత రాహుల్‌ గాంధీ కుట్టిన చెప్పులకు రూ. 10 లక్షలు డిమాండ్‌ పలుకుతోందట. అయితే వాటిని ఆమ్మేందుకు యజమాని మాత్రం ససేమిరా అంటున్నాడు. అసలు రాహుల్‌ గాంధీ ఏంటి? చెప్పులు కుట్టడం ఏంటి? అవి అమ్మడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? అక్కడికే వస్తున్నాం..

ఇటీవల ఓ కేసు విషయంలో రాహుల్‌ ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌ కోర్టు హాజరయ్యారు. ఈ క్రమంలో అక్కడి నుంచి వస్తూ దారిలో ఉన్న ఓ చెప్పుల దుకాణం వద్ద ఆగాడు. అక్కడ చెప్పులు కుట్టే రామ్‌ చేత్‌ వ్యక్తిని కలిసి అతని పని గురించి తెలుసుకున్నాడు. అనంతరం అక్కడే ఓ చెప్పుల జత కుట్టాడు. అతనికి సాయం చేస్తానని హామీ ఇచ్చారు. తనను కలిసి మరుసటి రోజే చెప్పులు కుట్టుకునే వ్యక్తికి  ఓ షూ స్టిచింగ్‌ మెషిన్‌ను అందించాడు.

ఇప్పుడు ఈ స్లిప్పర్స్‌‌ కు ఫుల్‌‌ డిమాండ్‌‌ ఏర్పడింది. రాహుల్‌‌  గాంధీ రామ్‌‌ చేత్‌నును కలిసి వెళ్లిన తర్వాత ఉత్తరప్రదేశ్​ ప్రభుత్వంలో పలు శాఖల అధికారులు వచ్చి, ఆయన సమస్యలు తెలుసుకుంటున్నారు. అయితే రాహుల్‌ కుట్టిన చెప్పులకు ఎన్ని లక్షలు ఇచ్చినా.. అమ్మేది లేదని  చెప్పులు కుట్టే వ్యక్తి తేల్చి చెప్పారు. ఆయన కుట్టిన చెప్పులను ఓ గ్లాస్​ ఫ్రేమ్​లో భద్రపరచనున్నట్లు వెల్లడించాడు. రాహుల్​ గాంధీ తన వద్దకు రావడం, తన జీవితాన్నే మార్చేసిందని పేర్కొన్నాడు.

‘రాహుల్‌‌ కుట్టిన చెప్పులను మేము కొంటామంటూ ప్రతి రోజూ నాకు చాలా ఫోన్ కాల్స్‌‌ వస్తున్నాయి. మంగళవారం ఒక వ్యక్తి ఫోన్‌‌  చేసి రూ.5 లక్షలు ఇస్తాం.. చెప్పులు ఇవ్వాలని అడిగాడు. నేను కుదరదని చెప్పాను. అప్పుడు అతను రూ.10 లక్షలు ఇస్తానన్నాడు. నేను ఇవ్వను అని చెప్పాను. ఈ చెప్పులు నాకు లక్కీ.. వీటికి గాజు ఫ్రేమ్‌‌  కట్టించి. నా షాప్‌‌ లో పెట్టుకుంటాను’ అని చెప్పాడు. రాహుల్‌‌  గాంధీ తన దుకాణంలో కూర్చొని చెప్పు కుట్టడం ద్వారా ఆయన తన పార్ట్‌నర్‌ అయ్యారని రామ్‌‌  అన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)