Breaking News

జనం గుండె ‘జగన్.. జగన్.. జగన్’ అంటూ ధ్వనిస్తోంది : రోజా

Published on Wed, 06/18/2025 - 17:03

సాక్షి,గుంటూరు: వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల చేరుకున్నారు. రెంటపాళ్లలో కూటమి నేతలు, పోలీసుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న రెంటపాళ్ల ఉపసర్పంచ్‌ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం, నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు.  

అయితే, వైఎస్‌ జగన్‌ రెంటపాళ్ల పర్యటన వేళ కూటమి ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకుల్ని సృష్టించింది. పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకుంది. భారీ కేడ్లు, చెక్‌ పోస్టులతో వైఎస్‌ జగన్‌ అభిమానుల్ని, వైఎస్సార్‌సీపీ శ్రేణుల్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. కానీ వైఎస్ జగన్‌పై తమకు ఉన్న అభిమానం చెక్కు చెదరలేదని అభిమానులు, శ్రేణులు నిరూపించారు.

తమ అభిమాన నాయకుడు రెంటపాళ్లకు వస్తున్నారనే సమాచారంతో సత్తెనపల్లితో పాటు ఇతర నియోజకవర్గాల నుంచి వైఎస్సార్‌సీపీ అభిమానులు,పార్టీ శ్రేణులు రెంటపాళ్లవైపు కదిలారు. జనప్రభంజనంలా తరలివచ్చారు. వెల్లువలా వచ్చిన ప్రజలతో సత్తెనపల్లి నియోజకవర్గం జనసంద్రంలా మారింది. ప్రభుత్వం ఆంక్షలు సైతం వైఎస్ జగన్‌పై ప్రజలు చూపిస్తున్న అభిమానాన్ని అడ్డుకోలేకపోయాయి.  ఈ క్రమంలో వైఎస్‌ జగన్‌ రెంటపాళ్ల పర్యటనపై అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్న కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి ఆర్కే రోజా ఎక్స్‌ వేదికగా స్పందించారు.   

వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని నిలువరించాలని అనుకున్నారు. అభిమానులను ఆపాలని చూశారు. అడ్డుకట్ట వేయాలని యత్నించారు. షరతులు విధించారు.. ఆంక్షలు పెట్టారు.. బెదిరింపులకు దిగారు.. నోటీసులు ఇచ్చారు.. బారికేడ్లు ఏర్పాటు చేశారు. కానీ వైఎస్‌ జగన్‌ అభిమాన సునామీని మాత్రం అడ్డుకోలేకపోయారు. అభిమాన తరంగాలను ఆపలేకపోయారు.

“రోడ్లు మూసేశారా? మాకేం!”
“పోలీసులు అడ్డుపడుతున్నారా? మాకేం!”
మన గుండెల్లో ‘జగన్.. జగన్.. జగన్’ అంటూ ధ్వని మారుతోంది.
మన నరాల్లో ప్రవహించే రక్తం, జననేతను ఒక్కసారి చూడాలనే తపనతో ఉప్పొంగుతోంది.

అందుకే..
పొలాల గట్లే రోడ్లయ్యాయి,
పొలాల బాటలే ఎర్ర తివాచీలయ్యాయి,
ముళ్ల దారులే హైవేలయ్యాయి.
అభిమానులు పోటెత్తారు!

“తగ్గేదేలే!” అంటూ
జగన్‌ను ఒక్క చూపైనా చూడాలన్న ఆశతో
ఇలా బయలుదేరారు…

 

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)