మీరు కోరినట్లు చేస్తే మేం ప్రతిపక్షంలో ఉంటాం: సీఎం రేవంత్‌

Published on Sat, 12/21/2024 - 13:17

హైదరాబాద్‌, సాక్షి: ప్రతిపక్ష నేత కేసీఆర్‌ వచ్చి రైతు భరోసా మీద సలహాలు ఇస్తారని అనుకున్నానని, సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే రావట్లేదని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో భూభారతి, రైతు భరోసాలపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు.

బీఆర్‌ఎస్‌ హయాంలో క్రషర్‌ యూనిట్లకు, మైనింగ్‌ భూములకు రైతు బంధు ఇచ్చారు.  లేఅవుట్లు వేసి.. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసిన వాళ్లకు కూడా రైతు బంధు ఇచ్చారు. రోడ్డు విస్తరణలో పోయిన భూమికి కూడా రైతు బంధు ఇచ్చారు.

మేము ఇచ్చినట్లు గానే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలని కేటీఆర్ అంటున్నారు. మీరు ఇచ్చినట్లు ఇస్తే..మేము ప్రతిపక్షం లో ఉంటాం. ఆ తర్వాత బయటకు వెల్లాల్సి వస్తుంది. కేసీఆర్ చేసిన ఘనకార్యానికి ఇప్పుడు ఆయన సభకు రాలేకపోతున్నారు..

గుట్టలు, రోడ్డు, రియలెస్టేట్ వెంచర్లకు రైతు భరోసా ఇవ్వాలా? వద్దా? బీఆర్ఎస్ సమాధానం చెప్పాలి. మా ప్రభుత్వం సూచనలను తీసుకోవడానికి సిద్ధం గా ఉంది. బీఆర్ఎస్ సభలో ఎంత చిల్లరగా వ్యవహరించినా ఓపికతో ఉన్నాం’ అని రేవంత్‌ అన్నారు.

అబద్ధాల సంఘానికి అధ్యక్షుడు 
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ప్రవర్తన, చిత్ర విచిత్ర వేషాలు ప్రజలు గమనిస్తున్నారు. అబద్ధాల సంఘానికి అధ్యక్షుడు సభకు రాలేదు. ఉపాధ్యక్షుడు వచ్చారు.

మాజీ సీఎం కేసీఆర్‌ అసెంబ్లీకి వచ్చి రైతుభరోసాపై సలహాలు ఇస్తారనుకున్నాం. కానీ అలా జరగడం లేదు.గత పదేళ్ల పాలనపై సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే సభకు రావడం లేదేమో

ఒకసారి అధికారం.. మరోసారి డిపాజిట్లు కోల్పోయిన బీఆర్‌ఎస్‌ నేతల తీరు మారడం లేదు. మీరు లక్ష రూపాయల రుణమాఫీ చేయడానికి ఆపసోపాలు పడ్డారు. కానీ మేం మీలా కాదు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రుణమాఫీ చేశామని అన్నారు.

మైనింగ్ భూములకు కూడా రైతు బంధు ఇచ్చారు: సీఎం రేవంత్

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)