Breaking News

రైతులకు ఉచిత కరెంట్‌ ఇవ్వొద్దు..: రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Published on Tue, 07/11/2023 - 11:30

రైతులకు నిరంతరాయ ఉచిత కరెంట్‌పై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్‌ అవసరం లేదని.. 3 గంటలు ఇస్తే చాలని వ్యాఖ్యానించారు. కాగా అమెరికా పర్యటనలో ఉన్న రేవంత్‌.. సోమవారం తానా మహాసభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తానా ప్రతినిధులనుద్దేశించి ఆయన మాట్లాడారు. అనంతరం ఎన్‌ఆర్‌ఐలు, పలు మీడియా వ్యక్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

ఈ క్రమంలో ఓ ఎన్‌ఆర్‌ఐ రేవంత్‌ను ఆసక్తికర ప్రశ్న వేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రైతులకు నిరాంతరాయంగా అందుతున్న కరెంట్‌ను, దళిత బంధు పథకాన్ని కొనసాగిస్తారా లేక తొలగిస్తారా అని ప్రశ్నించారు. దీనిపై రేవంత్‌ మాట్లాడుతూ.. తెలంగాణలో 95శాతం మంది రైతులు మూడెకరాల లోపున్న చిన్న, సన్నకారు రైతులేనని తెలిపారు.

ఒక ఎకరాకు సాగు నీరు పారించాలంటే ఒక గంట సరిపోతుందని, అదే మూడు ఎకరాలకు ఫుల్లుగా నీళ్లు పట్టాలంటే మూడు గంటలు చాలని వ్యాఖ్యానించారు. మొత్తం మీద ఒక రైతుకు ఎనిమిది గంటలు ఉచిత విద్యుత్‌ ఇస్తే సరిపోతుందని పేర్కొన్నారు. కేవలం విద్యుత్‌ సంస్థల వద్ద కమీషన్‌కు కక్కుర్తి పడి వ్యవసాయానికి 24 గంటలు ఉచిత కరెంట్‌ అనే నినాదాన్ని తీసుకొచ్చారని విమర్శించారు. ఉచిత కరెంట్‌ పేరుతో సీఎం కేసీఆర్‌ ప్రజలను మభ్యపెడుతున్నాడని, ఉచితాన్ని మన స్వార్థానికి వాడుకోవద్దని అన్నారు.
చదవండి: ఉప ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తారా? అవసరమైతే సీతక్కే సీఎం..

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు