మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం
Breaking News
కేసీఆర్ పాలనలో పైలం బిడ్డో అంటూ బడికి..
Published on Tue, 08/09/2022 - 05:17
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ పాలనలో అస్తవ్యస్తంగా మారిన ప్రభుత్వ పాఠశాలలపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టిపెట్టి పనిచేస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వెల్లడించారు. అచ్చంపేట నియోజకవర్గంలోని తాగపూర్ ప్రభుత్వ పాఠశాల దుస్థితిని వీడియో రూపంలో సోమవారం ట్విట్టర్‌లో పోస్టుచేసిన ఆయన.. ‘చదువుకునే చోటులేదు.
చదువుకునేందుకు పుస్తకం లేదు. చదువుచెప్పే గురువులు లేరు. పసిపిల్లల ప్రాణాలకు భరోసా లేదు. ఈ ఉద్యమద్రోహి పాలనలో పైలం బిడ్డో.. అని బడికి పంపే పరిస్థితి’అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వ పాఠశాలలపై సీఎం కేసీఆర్‌తో పాటు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ ప్రభుత్వ సూళ్ల విద్యార్థులకు ఇప్పటికీ పుస్తకాలు రాకపోవడం, సరిపడా టీచర్లు లేకపోవడంపై ప్రశ్నించారు.
Tags : 1