Breaking News

మందకృష్ణ వ్యాఖ్యలపై రేవంత్‌ రెడ్డి కౌంటర్‌

Published on Tue, 08/15/2023 - 13:24

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల కోసమే రైతు రుణమాఫీ చేస్తున్నారని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. నాలుగేళ్లలో రైతులపై పడ్డ వడ్డీని ఎవరు కడతారని ప్రశ్నించారు. ఇప్పుడు చేస్తున్న రుణమాఫీ వడ్డీకి కూడా సరిపోవని విమర్శించారు. చేస్తుంది రుణమాఫీనా? వడ్డీ మాఫినా అని వ్యంగ్యస్త్రాలు సంధించారు.

మంగళవారం రేవంత్‌ మాట్లాడుతూ.. ఓటమి భయంతోనే కేసీఆర్ రుణమాఫీ, నోటిఫికేషన్లు, డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తానంటున్నాడని మండిపడ్డారు. కేసీఆర్ ఏది చేసినా ప్రజలు నమ్మరని, బీఆఆర్‌ఎస్‌ ప్రభుత్వం హడావుడిగా అమ్మిన భూములపై కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక సమీక్షిస్తామని తెలిపారు

ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వ్యాఖ్యలపై రేవంత్‌ రెడ్డి స్పందించారు. ఎస్సీ వర్గీకరణ ఎవరి పేటెంట్‌ కాదని వ్యాఖ్యానించారు. ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్‌కు స్పష్టమైన విధానం ఉందని, తమ కమిట్‌మెంట్‌కి ఎవరి సర్టిఫికెట్‌ అవసరం లేదన్నారు. ధామాషా పద్దతి ప్రకారం వర్గీకరణ ఎలా చేయాలో తమకు తెలుసన్నారు. ఎవరి వకాల్తాలు తమకు అవసరం లేదని, ఎవరి బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.
చదవండి: తెలంగాణలో మున్సిపాలిటీలు దేశానికే ఆదర్శం: కేటీఆర్‌

బెదిరించే వారు ఎవరికి మద్దతు ఇచ్చారో వారినే అడిగితే మంచిదని హితవు పలికారు. ఒకరికి మద్దతు ఇచ్చి.. మరొకరిని డిమాండ్‌ చేయడం కరెక్ట్‌ కాదన్నారు. వర్గీకరణ పట్ల కాంగ్రెస్‌ చిత్తశుద్ధిని శంకించాల్సిన పనిలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ సామాజిక వర్గానికి కాంగ్రెస్ ఏంటో తెలుసని, రిజర్వేషన్లు ఇచ్చిందే కాంగ్రెస్‌ అని తెలిపారు.  మాట ఇచ్చిన వాళ్ళని ప్రశ్నించి మీ చిత్తశుద్ది నిరూపించుకోండని మందకృష్ణకి పరోక్షంగా చురకలు అంటించారు

బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి దేవుడు ఇచ్చిన అన్న కదా.. అయన్ని ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు.  కిషన్ రెడ్డి ఎందుకు పార్లమెంట్‌లో మాట్లాడం లేదని ప్రశ్నించారు. వాళ్ళ ప్రభుత్వంపై ఎందుకు ఓత్తిడి తేవడం లేదన్నారు. మాట ఇచ్చి అమలు చేయని వారిని నిలదీసి మీ చిత్తశుద్ధి నిరూపిస్తే కొంతైనా మీకు గౌరవం ఉంటుందని రేవంత్ హితవు పలికారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)