అధికారంలోకి రాగానే పాలమూరు ఎత్తిపోతల పూర్తిచేస్తాం

Published on Mon, 07/24/2023 - 03:50

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి రాగానే పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తామని, రాబోయే వందరోజుల్లో కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కోరారు. గద్వాల జెడ్పీ చైర్‌పర్సన్‌ సరిత తిరుపతయ్య, బండ్ల చంద్రశేఖర్‌రెడ్డిల సమక్షంలో పలు గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పెద్ద సంఖ్యలో బీఆర్‌ఎస్, బీజేపీల నుంచి ఆదివారం గాందీభవన్‌లో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ గద్వాల జిల్లా బంగ్లాలో బందీ అయ్యిందని, ఆ జిల్లా ప్రజలను బంగ్లాల ముందు బానిసలుగా మార్చారని ఆరోపించారు. జిల్లాలో కొందరు బీఆర్‌ఎస్, బీజేపీలోకి వెళ్లినంత మాత్రాన ఏమీ కాదన్నారు. గద్వాలకు చెందిన బడుగు,బలహీన వర్గాలు ఎప్పు డూ కాంగ్రెస్‌ వైపే ఉన్నారని వ్యాఖ్యానించారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా బిడ్డ అయిన తనకు టీపీసీసీ అధ్యక్ష పదవితో సోనియాగాంధీ గౌరవం ఇచ్చారని, అందుకు ప్రతిగా పాలమూరుజిల్లాలో 14కు 14 స్థానాలు కాంగ్రెస్‌ పార్టీ గెలుపొందేలా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లురవి తదితరులు పాల్గొన్నారు.  

జీఓ 111పై నివేదిక సమర్పణ 
జీఓ 111పై అధ్యయనం చేసేందుకుగాను రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేసిన కమిటీ రూపొందించిన నివేదికను రేవంత్‌రెడ్డికి అందజేశారు. కమిటీ చైర్మన్‌ ఎం.కోదండరెడ్డి నేతృత్వంలో సభ్యులు అన్వేశ్‌రెడ్డి, జగదీశ్వర్‌రావు ఈ నివేదిక తయారు చేశారు. 

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)